భారతదేశంలో ద్విచక్ర వాహనాల (Two Wheelers) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం ఎక్కువగా ఉంది. భారతదేశంలో ప్రముఖ ఈ స్కూటర్ కంపెనీలలో ఒకటి ఏథర్ కంపెనీ. 

Continues below advertisement

ఏథర్ ఈ స్కూటర్

ఏథర్ (Ather 450 X E) కంపెనీ వివిధ ఈ స్కూటర్లను పరిచయం చేస్తోంది. ఏథర్ కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి ఏథర్ 450X. ఈ ఈ స్కూటర్ ధర, నాణ్యత, మైలేజ్ గురించి ఇక్కడ చూడవచ్చు. ఈ స్కూటర్ మొత్తం 4 వేరియంట్‌లలో ఉంది.

1. 450X:

ఏథర్ 450X ఈ వేరియంట్ 2.9 కిలోవాట్ బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఈ ఏథర్ స్కూటీ ఛార్జింగ్ చేయడానికి 4.3 గంటలు పడుతుంది. ఈ E-Scooter తెలుపు, బూడిద, నీలం, నలుపు  మొత్తం 8 రంగులలో అందుబాటులో ఉంది. ఈ స్కూటీ ధర 1 లక్షల 57 వేల 416 రూపాయలు.

Continues below advertisement

2. 450X:

ఏథర్ 450X ఈ స్కూటర్ ఈ వేరియంట్ ధర రూ.1 లక్షల 69 వేల 327. దీని బ్యాటరీ 3.7 కిలోవాట్ల శక్తిని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 5.45 గంటలు పడుతుంది. ఈ E Scooter కూడా నలుపు, తెలుపు, బూడిద రంగులలో మొత్తం 8 వేరియంట్‌లలో ఉంది. 

3. 450X ఏథర్ స్టాక్ ప్రో:

ఏథర్ 450X ఏథర్ స్టాక్ ప్రో ధర రూ.1 లక్షల 70 వేల 416. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 90 కి.మీ వరకు వెళ్లే శక్తిని కలిగి ఉంది. 2.9 కిలోవాట్ బ్యాటరీని కలిగి ఉంది. 4.3 గంటలు ఛార్జింగ్ చేయడానికి తీసుకుంటుంది. నలుపు, ఎరుపు, తెలుపు రంగులలో ఈ ఈ-స్కూటీ 8 రంగులలో ఉంది. 

4. 450X ఏథర్ స్టాక్ ప్రో:

450X ఏథర్ స్టాక్ ప్రో ఈ స్కూటర్‌లో 3.7 కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఏథర్ స్టాక్ ప్రో ఒకసారి ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో వెళ్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 5.45 గంటలు పడుతుంది. దీని ధర రూ.1 లక్షల 83 వేల 327.  

ఈ ఈ-స్కూటర్ (E Scooter) బరువు 108 కిలోలు. కాలిబర్ ఫ్రంట్ 3 పిస్టన్ ఉంది. బరువు తక్కువగా ఉండే ఈ స్కూటర్‌లో ఛార్జర్ సౌకర్యం ఉంది. ఇందులో సిబిఎస్, డిస్క్ సౌకర్యం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వరకు వారంటీ ఇచ్చారు.

టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. 7 అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఇచ్చారు. మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేయవచ్చు. ఎల్‌ఈడీ లైట్లు ఇందులో ఉన్నాయి. 22 లీటర్ల డిక్కీ సౌకర్యం కల్పించారు.