Sarpanch elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఆధిపత్య పోరాటం ఎక్కువగా జరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్య నేతలంతా ఆయా పార్టీల మద్దతుదారులుగానే బరిలోకి దిగుతూంటారు. అయితే వారిలో చాలా మంది నేతలు తమ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆర్థికంగా సాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మంచి అవకాశాలు ఉంటాయి.
గ్రామస్థాయి నేతలు తమ గ్రామాల్లో ప్రజల కష్టానష్టాల్లో తోడు ఉంటున్నారు. చదువుల్లో ముందుకున్న పేదలకుసాయం చేయడంతో పాటు.. ఎవరైనా చనిపోతే ఆయా కుటుంబాలకు సాయం చేయడం వంటి పనులు చేస్తూంటారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ పెద్ద ఎత్తున గ్రామాల్లో నేతలు తమ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
డిండి మండలం తవక్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ పొన్నగంటి అలివేలు కృష్ణయ్య వంటి వారు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారు. ఎవరైనాచనిపోతే వారి కుటుంబాలను పరామర్శించి తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే చదువుల్లో మంచిమార్కులు సాధించిన వారికి కూడా మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం చేస్తారు. విద్యార్థులు మంచిగా చదివి మంచిగా మార్కులు తెచ్చుకుంటే ఇలాగే ఇస్తానని 2005 వ సంవత్సరం నుంచి చెప్పి అప్పుడు నుంచి ఇప్పటివరకు ఇస్తున్నారు.
ఇలాంటి సేవాదృక్పధంతో పని చేసే వారు గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజల అభిమానం పొందుతున్నారు. అలాంటి వారే ఎక్కువగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు.