భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నందున వాహనదారులు ఖర్చులు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లకు మారుతున్నారు. ఈ క్రమంలో Ampere Reo VYB అనే కొత్త లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ EV ప్రత్యేకత ఏంటంటే, దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే స్కూటర్‌కు RTO రిజిస్ట్రేషన్ సైతం అవసరం లేదు. ఈ స్కూటర్‌ను విద్యార్థులు, వృద్ధులు, తొలిసారి వాహనం కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈజీగా నడపవచ్చు. 

Continues below advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత?హైదరాబాద్‌లో Ampere Reo VYB ఎలక్ట్రిక్ స్కూటర్ బేసిక్ మోడల్ ధర రూ. 69 వేల 499గా ఉంది.  ఇది కంపెనీ ప్రీమియం వెర్షన్, ఇందులో డిజైన్, ఫీచర్లు, లుక్ పరంగా మార్పులు చేసింది. గత మోడల్ కంటే ఇది మరింత మోడ్రన్, స్పోర్టీగా ఉంది. ఈ ఈవీ ముందు భాగంలో LED DRL, సైడ్ బాడీపై యాంబియంట్ లైట్ ఇచ్చారు. ఈ స్కూటర్ వార్మ్ వైట్, పేస్టర్ పర్పుల్, డార్క్ గ్రే, ఆక్వా మెటాలిక్ 4 రంగులలో విక్రయాలు జరుగుతున్నాయి.  

Ampere Reo VYB స్కూటర్‌లో 1.44 kWh సామర్థ్యం గల LFP బ్యాటరీ ఇచ్చారు. మీరు కనుక ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని Ampere కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. సిటీ రోడ్లపై ఇది సరిపోతుందని వాహనదారులు కొందరు చెబుతున్నారు. ఈ స్కూటర్‌ను నడపడానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric scooter) ఛార్జ్ అవ్వడానికి 5 గంటల 30 నిమిషాల టైం పడుతుంది. 

Continues below advertisement

Also Read: SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్

ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరుఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చాలా ఫీచర్లు ఇచ్చారు. స్కూటర్‌లో కీలెస్ గో సిస్టమ్, ప్రీమియం కీ ఫాబ్, రివర్స్ మోడ్, LED లైటింగ్, మెయిన్ స్టాండ్, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 24 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సౌకర్యాలు ఉన్నాయి.

పనితీరు విషయానికి వస్తే, ఇందులో 0.25 kW హబ్ మోటార్ ఇచ్చారు. ఇది 35 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు భాగంలో 12 అంగుళాల అల్లాయ్ వీల్, డిస్క్ బ్రేక్ ఇచ్చారు.  వెనుక భాగంలో 10 అంగుళాల వీల్ లభిస్తుంది. ఇందులో 140 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1310 మిమీ వీల్‌బేస్ ఉన్నాయి. సిటీ రోడ్లపై సౌకర్యవంతంగా, బ్యాలెన్స్‌డ్ రైడింగ్‌ను అందించడంలో హెల్ప్ అవుతుంది. ఈవీని ముఖ్యంగా సిటీ రోడ్లపై, రోజువారీ చిన్న చిన్న పనుల మీద బయటకు వెళ్లే వారి కోసం రూపొందించారు. దీంతో పాటు ఇది లాస్ట్ మైల్ డెలివరీ సేవలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 

Also Read: Is Ethanol Cheaper than Petrol: పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌ వాడకంతో ఖర్చు పెరుగుతుందా ? మైలేజ్‌లోనూ వ్యత్యాసం