AP SSC Advanced Supplementary Exam Results | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (AP 10th Class Supply Results) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ మార్కుల వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీ టెన్త్ సప్లిమెంటరీ మెమో డౌన్‌లోడ్ చేసుకోండి
విద్యార్థులు తమ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ను సందర్శించాలి. అక్కడ హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న SSC Advanced Supplementary Results లింక్‌పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత మార్చిలో జరిగిన రెగ్యూలర్ పరీక్షల్లో పాస్ కాలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది.
వాట్సాప్‌లోనూ ఫలితాలువిద్యాశాఖ బోర్డ్ సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కనుక విద్యార్థులకు వాట్సాప్‌లోనూ ఫలితాలు అందిస్తున్నారు. Mana Mitra WhatsApp Governance వాట్సాప్ నెంబర్ 95523 00009 ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
గత ఏడాది కంటే 6.25 శాతం ఎక్కువ ఉత్తీర్ణత
పరీక్షలకు హాజరైన 94,990 మంది విద్యార్థులలో 78,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీని ద్వారా ఈ ఏడాది 82.39% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది గతేడాది నమోదైన 76.14% కంటే 6.25 శాతం అధికం. ప్రభుత్వం చేపట్టిన '20-రోజుల కార్యాచరణ ప్రణాళిక' విజయాన్ని స్పష్టం చేస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షల తర్వాత విద్యార్థులకు నిర్దేశిత విద్యాపరమైన మద్దతు, ఇంటెన్సివ్ కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందించారు.
