Affordable 7 Seater Cars: భారతదేశంలో సెవెన్ సీటర్ కార్ల పరంగా ఎక్కువ ఆప్షన్లు లేకపోవడం వల్ల మార్కెట్లో లభించే చాలా సెవెన్ సీటర్ల ధరలు రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా వినియోగదారులు సెవెన్ సీటర్ కావాలనుకుంటే ఖరీదైన ఎంపీవీ లేదా ఎస్‌యూవీని మాత్రమే కొనుగోలు చేయాలి. అయితే మీ బడ్జెట్ తక్కువగా ఉండి మీరు మంచి సెవెన్ సీటర్ కారును కొనుగోలు చేయాలనుకుంటే రూ. ఏడు లక్షల కంటే తక్కువ ధర ఉన్న రెండు కార్ల గురించి తెలుసుకుందాం.


మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco)
మారుతి సుజుకి ఈకో దేశంలోని చవకైన 7 సీటర్ కార్లలో ఒకటి, ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.32 లక్షలుగా ఉంది. మారుతి సుజుకి లాంచ్ చేసిన ఈ కారు చాలా ప్రజాదరణ పొందింది. దాదాపు ప్రతి నెలా ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లలో ఉంటూనే వస్తుంది. ఈ కారు ప్రతి నెలా దాదాపు 10 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మారుతి ఈకో 1196 సీసీ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్ అయింది. ఇది పెట్రోల్‌తో లీటరుకు 19.71 కిలోమీటర్లు, సీఎన్‌జీతో 26.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!


రెనో ట్రైబర్ (Renault Triber)
రెనో ట్రైబర్ 7 సీటర్ కార్ సెగ్మెంట్‌లో అద్భుతమైన, అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్. ఇది కూడా ప్రతి నెల ఎక్కువ సంఖ్యలోనే అమ్ముడవుతోంది. సెవెన్ సీటర్ రెనో ట్రైబర్  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.33 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 999 సీసీ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు లాంచ్ అయింది. రెనో ట్రైబర్ లీటరు పెట్రోలుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.


ప్రస్తుతం మనదేశంలో సెవెన్ సీటర్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిలో మారుతి సుజుకి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడవుతోంది. అయితే ఎర్టిగా ధర రూ.8 లక్షలకు పైగానే ఉంది. ఇది కాకుండా కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6, మహీంద్రా బొలెరో, బొలెరో నియో ప్లస్ కూడా సెగ్మెంట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.


మరోవైపు ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఐవూమి సంస్థ విడుదల చేసింది. ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ అనే పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశ మార్కెట్లో మూడు బ్యాటరీ ప్యాక్ సైజులలో లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ పెడితే 170 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఐవూమీ జీట్ఎక్స్ జెడ్ఈ బుకింగ్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో ప్రారంభం అయింది. అయితే ఈ స్కూటర్ డెలివరీ తేదీ గురించి కంపెనీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్లోకి రావడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ-స్కూటర్లు కొనాలనుకునే వారికి మరొక మంచి ఆప్షన్ లభించినట్లు అయింది.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?