Upcoming Electric Scooter India 2026: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో EV అమ్మకాలు గట్టిగా పెరుగుతున్నాయి. రెండు చక్రాల రంగంలో వచ్చే ఏడాది పెద్ద ఎత్తున కొత్త ఇ-స్కూటర్లు ఎంట్రీ ఇవ్వబోతుండటంతో యూజర్లలో ఇప్పటికే మంచి ఆసక్తి కనిపిస్తోంది. Yamaha, Bajaj వంటి పెద్ద కంపెనీల నుంచి Simple Energy, Ather వంటి ప్రముఖ EV బ్రాండ్ల వరకు తమ కొత్త మోడళ్లతో మార్కెట్లోకి రానున్నాయి.
2026లో భారత్‌లో రిలీజ్ కావాల్సిన ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు
1. Yamaha Aerox-E - యమహా తొలి ఇ-స్కూటర్ ఎంట్రీయమహా, ఇటీవల, భారత్‌లో Aerox-Eని అధికారికంగా రివీల్ చేసింది. 2026 ప్రారంభంలో విక్రయాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 9.4 kW ఇంజిన్ పవర్‌ను అందిస్తుంది, పీక్ టార్క్ 48 Nm. ఒకసారి చార్జ్ చేస్తే 106 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తారని కంపెనీ చెబుతోంది. డిజైన్ విషయానికి వస్తే, ICE Aerox మాదిరిగానే స్పోర్టీ లుక్‌తో పాటు కొన్ని ఎలక్ట్రిక్ స్పెసిఫిక్ మార్పులు కనిపిస్తాయి. Eco, Standard, Power అనే మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, స్మార్ట్ కీ సిస్టమ్, 5-అంగుళాల TFT క్లస్టర్, బ్లూటూత్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందిస్తారు.
2. Yamaha EC-06 - ఫ్యామిలీ యూజర్ల కోసం కొత్త మాక్సీ స్కూటర్Aerox-Eతో పాటు Yamaha EC-06ను కూడా అధికారికంగా చూపించింది. ఇది 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుంది. River Mobilityతో కలిసి యమహా ఈ మోడల్‌ను తయారు చేయనుంది. 4 kWh హై-కెపాసిటీ బ్యాటరీ, సింగిల్ చార్జ్‌పై 160 కిలోమీటర్ల రేంజ్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌ను ఫ్యామిలీ యూజర్లకు మంచి ఆప్షన్‌గా మారుస్తాయి. 4.5 kW మోటార్ పీక్ పవర్ 6.7 kW ఇస్తుంది. LCD క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ టెలిమాటిక్స్, మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
3. New-Gen Bajaj Chetak - మరింత అప్‌డేటెడ్ వెర్షన్భారత మార్కెట్లో టాప్ సెల్లింగ్ ఇ-స్కూటర్లలో Chetak ఒకటి. ఇప్పుడు కొత్త తరం మోడల్‌ని బజాజ్ టెస్ట్ చేస్తోంది. స్పై ఇమేజెస్‌లో... కొత్త టెయిల్ ల్యాంప్, కొత్త రియర్ టైర్ హగ్గర్, ఫ్లాట్ సీటు, మార్పులు చేసిన స్విచ్ గియర్ వంటి అప్‌డేట్స్ కనిపించాయి. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 3.5 kWh బ్యాటరీనే కొత్త మోడల్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఫుల్ చార్జ్‌పై సుమారు 150 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వవచ్చని అంచనాలు ఉన్నాయి.
4. Simple Energy Family-Oriented E-Scooter - పక్కా ఫ్యామిలీ స్కూటర్సింపుల్ ఎనర్జీ ప్రస్తుతం స్పోర్టీ ఇ-స్కూటర్లతో మార్కెట్లో ఉంది. కొత్తగా, ఫ్యామిలీ యూజర్ల కోసం కొత్త ఇ-స్కూటర్‌ను రూపొందిస్తోంది. డిజైన్ పేటెంట్ ఆధారంగా చూస్తే, లాంగ్ ఫ్లాట్ సీటు, LED హెడ్‌ల్యాంప్, మందంగా ఉన్న సైడ్ ప్యానెల్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ వంటివి కనిపిస్తున్నాయి. టెక్నికల్ వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు, కానీ మొత్తం ఫ్యామిలీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026లో ఈ ఇ-స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
5. Ather EL Platform - 2026లో భారీ అప్‌గ్రేడ్Ather Energy తన కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల చూపించింది. ఇది, భవిష్యత్‌లో వచ్చే అన్ని నూతన Ather ఇ-స్కూటర్లకు మెయిన్ బేస్ అవుతుంది. AEBS (Advanced Electronic Braking System), కొత్త ఛార్జ్ డ్రైవ్ కంట్రోలర్ (Charge Drive Controller) వంటి ఆధునిక టెక్నాలజీలు ఇందులో భాగం. EL01 Concept స్కూటర్‌ను కంపెనీ ఇప్పటికే ప్రజలకు పరిచయం చేసింది. దీనిని ఫ్యామిలీ స్కూటర్‌గా రూపొందిస్తున్నారు. 2026 దసరా సమయంలో మొదటి EL సిరీస్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.