Affordable 350cc Motorcycles For Daily Office Commute: హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో యువతకు & ఆఫీసులకు వెళ్లేవారికి 350cc సెగ్మెంట్‌ బైక్‌లు ఇష్టసఖులు. ఆఫీస్‌, కాలేజీ అనే కాదు, యూత్‌ దగ్గర ఈ డుగ్‌డుగ్‌ బండ్లకు ఎప్పుడూ పాపులారిటీ తగ్గదు. ఇప్పుడు, సెప్టెంబర్ 22 నుంచి, 350cc లోపు ఉన్న బైకులపై GST రేటు 28% నుంచి 18%కి తగ్గుతుంది. దీనివల్ల ఈ బైక్‌ల ధరలు సుమారు 10% తగ్గుతాయి & ఇది కస్టమర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ మార్పు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ & హోండా వంటి కంపెనీల 350cc బైక్‌లను కూడా అందుబాటు ధరల్లోకి మారుస్తుంది.

Continues below advertisement


రాయల్ ఎన్‌ఫీల్డ్‌‌ బుల్లెట్ 350
తెలుగు రాష్ట్రాల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 ప్రస్తుతం ₹1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుంది. GST తగ్గింపు తర్వాత, దీనిని సుమారు ₹1,38,280 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 349cc, ఎయిర్-కూల్డ్ J-సిరీస్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 20.2 bhp & 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని తేలికైన & కాంపాక్ట్ డిజైన్ రోజువారీ నగర ప్రయాణాలకు అనువైనది. LED హెడ్‌లైట్, USB ఛార్జింగ్ & ట్రిప్పర్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350
క్లాసిక్ 350 కూడా తెలుగు యువతకు ఇష్టమైన బైక్. దీని ప్రారంభ ధర ప్రస్తుతం ₹2,00,157. కొత్త GST రేటుతో ఇది దాదాపు ₹1,84,518 అవుతుంది. ఇది 349cc ఇంజిన్‌తో పని చేస్తుంది, స్మూత్‌ పెర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. లాంగ్ రైడ్‌లు & సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం దీని లక్ష్యం. మైలేజ్ 35-37 kmpl. డ్యూయల్-ఛానల్ ABS & LED లైటింగ్ వంటి లక్షణాలు క్లాసిక్ 350 ని సురక్షితంగా & ఆధునికంగా చేస్తాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ 350
బుల్లెట్ 350 ఎప్పుడూ ఒక ఐకానిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్. ప్రస్తుతం ధర ₹1,76,625, GST తగ్గింపు తర్వాత దీని ధర దాదాపు ₹1,62,825 గా ఉంటుంది. ఇది 20.2 bhp & 27 Nm టార్క్ ఉత్పత్తి చేసే 349cc ఇంజిన్‌తో శక్తినిస్తుంది. మైలేజ్ 35 kmpl. దీని రా డిజైన్‌కు అత్యంత గుర్తింపు ఉంది & థంపింగ్ సౌండ్ 24/7 తెలుగు రోడ్లపై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.


రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మీటియర్ 350
క్రూయిజర్ స్టైలింగ్‌ను ఆస్వాదించే వారికి మీటియర్ 350 ఒక గొప్ప ఎంపిక. కొత్త GST రేట్ల తర్వాత ధరలు సుమారు ₹2,15,883 నుంచి ప్రారంభమవుతాయి. ఇది 20.2 bhp & 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 349cc ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. మైలేజ్ సుమారు 36 kmpl. బ్లూటూత్ కనెక్టివిటీ, LED హెడ్‌లైట్ & ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ వంటివి దీనిలోని ఫీచర్లు.


హోండా CB350
ఈ జాబితాలో హోండా CB350 మాత్రమే RE (Royal Enfield) ముద్ర లేని బైక్. దీని ప్రస్తుత ధర ₹2,14,800, కొత్త GST తర్వాత దాదాపు ₹1,98,018 కి తగ్గుతుంది. ఇది 20.8 bhp & 30 Nm టార్క్ ఉత్పత్తి చేసే 348cc ఇంజిన్‌తో పని చేస్తుంది. దీని మైలేజ్ 42 kmpl వరకు ఉంటుంది, ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యధికం. డ్యూయల్-ఛానల్ ABS, LED హెడ్‌లైట్ & డిజిటల్ డిస్‌ప్లే వంటివి ఈ మోటర్‌సైకిల్‌ను టెక్నాలజీతో నింపేశాయి. 


మీరు అందుబాటు ధర & శక్తిమంతమైన 350cc బైక్ కొనాలనుకుంటే, GST తగ్గింపు తర్వాత ఇప్పుడు సరైన సమయం కావచ్చు. హంటర్ 350 రోజువారీ నగర రైడింగ్‌కు సరైనది. క్లాసిక్ & బుల్లెట్ 350 వాటి ఐకానిక్ గుర్తింపు & సౌకర్యానికి ప్రసిద్ధి చెందాయి, మీటియర్ 350 లాంగ్‌ క్రూజింగ్‌కు అనువైనది & హోండా CB350 ఉత్తమ మైలేజీ అందిస్తుంది.