Renault Kwid new vs old differences: భారత్‌లో అత్యంత చవకగా అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన రెనాల్ట్ క్విడ్‌కు 2026 మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. 2019లో భారీ ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన ఈ కారు, 2022లో స్వల్ప కాస్మెటిక్ అప్‌డేట్‌ అందుకుంది. ఇప్పుడు మరోసారి చిన్నపాటి మార్పులతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈసారి డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త లోగో, కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్లు, తగ్గిన ధరలు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు మారుతి ఆల్టో కే10 & మారుతి ఎస్-ప్రెస్సోకు గట్టి పోటీగా నిలుస్తోంది.

Continues below advertisement

రెనాల్ట్ లోగో కొత్తగా..బయటి డిజైన్ పరంగా చూస్తే కొత్త క్విడ్‌లో పెద్దగా మార్పులు కనిపించవు. ముందు భాగంలో ఉన్న స్లిమ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, బంపర్‌లో అమర్చిన హెడ్‌ల్యాంప్స్, ఫాక్స్ ఫ్రంట్ డిఫ్యూజర్ డిజైన్‌ను అలాగే కొనసాగించారు. అయితే ముందుభాగంలో ఇప్పుడు రెనాల్ట్ కొత్త లోగోను అమర్చడం మాత్రమే ప్రధాన మార్పు. పక్క భాగంలో కూడా పెద్దగా మార్పులు లేవు. అయితే కొత్త టూ టోన్ వీల్ కవర్లు & వాటిపై కొత్త రెనాల్ట్ లోగోను అందించారు. టాప్ క్లైంబర్ వేరియంట్‌లో క్లైంబర్ బ్యాడ్జింగ్, రూఫ్ రైల్స్ & బ్లాక్ బాడీ క్లాడింగ్‌ను అలాగే ఉంచారు. వెనుక భాగంలో కూడా కొత్త రెనాల్ట్ లోగోతో పాటు టెయిల్‌గేట్‌పై కొత్త క్విడ్ లెటరింగ్‌ను అందించారు. టెయిల్ ల్యాంప్స్, బంపర్ & రిఫ్లెక్టర్లు మాత్రం పాత మోడల్‌లాగే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: E20 తర్వాత మరో పెద్ద అడుగు - డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ మిశ్రమానికి సిద్ధమవుతున్న భారత్

Continues below advertisement

క్యాబిన్‌లోకి అడుగు పెడితే ప్రధానంగా కనిపించే మార్పు స్టీరింగ్ వీల్. కొత్త డిజైన్‌తో పాటు రెనాల్ట్ తాజా లోగోను ఇందులో అందించారు. మిగిలిన ఇంటీరియర్ దాదాపు పాత మోడల్‌లాగే కొనసాగింది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ & డ్యాష్‌బోర్డ్‌పై ఫిజికల్ బటన్లు అందుబాటులో ఉన్నాయి. క్లైంబర్ మాన్యువల్ వేరియంట్‌లో టూ టోన్ గేర్ లివర్ & AMT వేరియంట్‌లో రోటరీ గేర్ సెలెక్టర్‌ను అలాగే కొనసాగించారు. సీట్లకు గ్రే రంగు అప్హోల్స్టరీతో పాటు పసుపు రంగు హైలైట్స్‌ను కూడా యథాతథంగా ఉంచారు.

ప్రాక్టికాలిటీ పరంగా కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. క్యాబిన్‌లో స్టోరేజ్ స్పేస్, ప్రయాణికులకు లభించే స్థలం & 279 లీటర్ల బూట్ స్పేస్ పాత మోడల్‌తో సమానంగానే ఉన్నాయి. దీంతో కుటుంబ అవసరాలకు అనువైన హ్యాచ్‌బ్యాక్‌గా ఇది కొనసాగనుంది.

ఇంజిన్‌లో కూడా మార్పులు చేయలేదు. 1.0 లీటర్ మూడు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 69 hp పవర్ & 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. పనితీరు & డ్రైవింగ్ అనుభవం కూడా పాత మోడల్‌తో సమానంగానే ఉండనుంది.

ఇది కూడా చదవండి: టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు

ధరలుమరో ముఖ్యమైన మార్పు వేరియంట్లలో కనిపిస్తోంది. గతంలో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న క్విడ్ ఇప్పుడు కేవలం ఎవల్యూషన్ & క్లైంబర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ షోరూమ్ ధరలు రూ.4.53 లక్షల నుంచి రూ.5.61 లక్షల వరకు ఉన్నాయి. బేస్ ఎవల్యూషన్ మాన్యువల్ వేరియంట్ ధర గతంతో పోలిస్తే రూ.13,500 తగ్గగా, AMT వేరియంట్ రూ.10,000 తగ్గింది. క్లైంబర్ మాన్యువల్ ధర రూ.32,000 తగ్గగా, AMT వేరియంట్ ధర రూ.27,200 మేర తగ్గింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ధరలు సుమారు రూ.5.33 లక్షల నుంచి రూ.6.69 లక్షల వరకు ఉంటాయి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.