Tyre load rating: కారు టైర్‌పై ఉన్న అక్షరాలు & సంఖ్యలు చాలామంది పట్టించుకోరు. కానీ వాటిలోనే మీ వాహన భద్రతకు సంబంధించిన కీలక సమాచారం దాగి ఉంటుంది. ముఖ్యంగా టైర్‌పై కనిపించే 91, 94, 97 వంటి సంఖ్యలు టైర్‌ సీరియల్‌ నంబర్లు మాత్రం కాదు. వాటిని టైర్ లోడ్ రేటింగ్ లేదా లోడ్ ఇండెక్స్ అంటారు. ప్రతి కారు యజమాని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఇది.

Continues below advertisement

టైర్ లోడ్ రేటింగ్ అంటే ఒక టైర్ గరిష్టంగా ఎంత బరువును సురక్షితంగా మోయగలదో తెలిపే సంఖ్య. ఈ సంఖ్యకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రత్యేక లోడ్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఆధారంగానే ఒక్కో సంఖ్యకు గరిష్ట బరువును నిర్ణయించడం జరిగింది.

మీ కారు టైర్ సైడ్‌వాల్‌పై 205/55 R17 91V వంటి కోడ్ కనిపించింది అనుకుందాం. ఇందులో 205 అంటే టైర్ వెడల్పు ‍‌(205 mm), 55 అంటే టైర్ ఎత్తు నిష్పత్తి, R17 అంటే 17 అంగుళాల (17”) రిమ్‌కు సరిపోయే టైర్. చివర్లో ఉండే 91 అనేది టైర్ లోడ్ రేటింగ్ కాగా, V అనేది స్పీడ్ రేటింగ్‌ను సూచిస్తుంది.

Continues below advertisement

ఉదాహరణకు 91 లోడ్ రేటింగ్ ఉన్న టైర్ సరైన గాలి ఒత్తిడితో గరిష్టంగా 615 కిలోల బరువును మోయగలదు.

లోడ్ ఇండెక్స్ టేబుల్‌

 
లోడ్ ఇండెక్స్ఒక్కో టైరుపై భారం (కేజీల్లో)లోడ్ ఇండెక్స్ఒక్కో టైరుపై భారం (కేజీల్లో)లోడ్ ఇండెక్స్ఒక్కో టైరుపై భారం (కేజీల్లో)
7033587545104900
7134588560105925
7235589580106950
7336590600107975
74375916151081000
75387926301091030
76400936501101060
77412946701111090
79437967101131150
80450977301141180
81462987501151215
82475997751161250
834871008001171285
845001018251181320
855151028501191360
865301038751201400

కొన్ని టైర్లపై XL అనే గుర్తు కూడా కనిపిస్తుంది. XL అంటే ఎక్స్‌ట్రా లోడ్‌ (Extra Load). అంటే, ఈ టైర్‌ సైజులోనే ఉన్న సాధారణ టైర్‌తో పోలిస్తే ఈ టైర్‌ను మరింత బలంగా తయారు చేస్తారు. దీంతో ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఉంటుంది.

ఉదాహరణకు 205/55 R16 94V XL టైర్‌ను తీసుకుంటే, ఇది, అదే సైజులోని సాధారణ టైర్ కంటే ఎక్కువ లోడ్‌ను భరించగలదు. 91 లోడ్ రేటింగ్ ఉన్న టైర్ 615 కిలోల వరకు మోయగలిగితే, 94 XL టైర్ గరిష్టంగా 650 కిలోల వరకు లోడ్‌ను భరించే సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు

ఎక్కువ లోడ్ టైర్లను వాడొచ్చా?అయితే చాలా మందికి వచ్చే సందేహం ఒకటే. కంపెనీ సూచించిన దానికంటే ఎక్కువ లోడ్ రేటింగ్ ఉన్న టైర్లను వాడొచ్చా? దీనికి సమాధానం అవును. ఎక్కువ లోడ్ రేటింగ్ ఉన్న టైర్లను వాహనానికి అమర్చుకోవచ్చు. ఎందుకంటే వాటిని ఎక్కువ బరువును భరించేలా తయారు చేస్తారు. అయితే, దీని అర్థం మీ కారులో ఎక్కువ బరువు తీసుకెళ్లొచ్చని కాదు. ఎందుకంటే ప్రతి వాహనానికి తయారీ సంస్థ నిర్ణయించిన గరిష్ట యాక్సిల్ లోడ్ పరిమితి ఉంటుంది. టైర్ సామర్థ్యం ఎక్కువగా ఉన్నా, వాహనం అనుమతించే పరిమితిని మించకూడదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఒకే సైజులో ఉన్న అన్ని టైర్లకూ ఒకే లోడ్ రేటింగ్ ఉండదు. ఒకే సైజులో వేర్వేరు లోడ్ ఇండెక్స్ & స్పీడ్ రేటింగ్‌లు ఉంటాయి. కాబట్టి కొత్త టైర్లు కొనుగోలు చేసే సమయంలో కేవలం సైజ్ మాత్రమే కాదు, లోడ్ రేటింగ్ & స్పీడ్ రేటింగ్ కూడా తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇది కూడా చదవండి: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

మీ కారు తయారీ సంస్థ సూచించిన టైర్ వివరాలు డ్రైవర్ డోర్‌పై ఉన్న స్టిక్కర్‌లో లేదా ఓనర్స్ మాన్యువల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త టైర్లు కొనుగోలు చేసే ముందు వాటిని ఒకసారి పరిశీలించడం మంచిది.

చిన్న సంఖ్యలా కనిపించే టైర్ లోడ్ రేటింగ్... వాస్తవానికి మీ ప్రయాణ భద్రత, టైర్ పనితీరు & వాహనం స్థిరత్వాన్ని నిర్ణయించే కీలక అంశం. కాబట్టి ఈసారి టైర్లు మార్చే ముందు లోడ్ రేటింగ్‌ను తప్పకుండా చెక్ చేయండి. అదే మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే తెలివైన నిర్ణయం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.