2026 Maruti Brezza Facelift: భారత మార్కెట్లో, అత్యధికంగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ SUVల్లో మారుతి సుజుకీ బ్రెజ్జా 2026 ఒకటి. అధికారికంగా జులై 24న విడుదల కానున్న ఈ SUV, లాంచ్‌కు ముందే పూర్తిగా లీక్ అయింది. డీలర్‌షిప్ స్టాక్‌యార్డ్‌లో ఎలాంటి క్యామొఫ్లాజ్ లేకుండా కనిపించిన కొత్త బ్రెజ్జా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కేవలం డిజైన్ మార్పులతోనే కాకుండా కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, అధునాతన ఫీచర్లతో బ్రెజ్జా మరింత ఆకర్షణీయంగా మారింది.

Continues below advertisement

2022లో రెండో తరం బ్రెజ్జా విడుదలైన తర్వాత వస్తున్న తొలి మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ఇదే. బయట కనిపించే మార్పులు పెద్దగా లేకపోయినా, ఫ్రంట్ గ్రిల్‌కు కొత్త గోల్డెన్ ఫినిష్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న గ్రే ఫినిష్ స్థానంలో ఇది మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ముందు బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేయగా, ఫాగ్ ల్యాంప్‌లను ట్రయాంగ్యులర్ హౌసింగ్‌లో అమర్చారు. హెడ్‌ల్యాంప్‌లు & LED DRLs మాత్రం యథాతథంగా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.

ఇంటీరియర్‌లో పెద్ద మార్పులుక్యాబిన్‌లో మాత్రం గణనీయమైన అప్‌డేట్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను అందించారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అంబియంట్ లైటింగ్, కొత్త HVAC కంట్రోల్స్, డ్యాష్‌బోర్డ్ & డోర్ ప్యాడ్‌లపై గ్లోస్ బ్లాక్ ఫినిష్ వంటి మార్పులు క్యాబిన్‌కు మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.

Continues below advertisement

ఇది కూడా చదవండి: రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు

భద్రత పరంగా కూడా బ్రెజ్జా ఒక అడుగు ముందుకేసింది. తొలిసారిగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు అందించనుండగా, Level 2 ADAS సూట్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అడాప్టివ్ సేఫ్టీ ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది.

ఇంజిన్ ఆప్షన్లలో అతి పెద్దఅయితే, ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అతి పెద్ద మార్పు ఇంజిన్ విభాగంలోనే ఉంది. కొత్తగా 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను మారుతి అందిస్తోంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఉన్నప్పటికీ, బ్రెజ్జాలో ఇది మరింత శక్తివంతమైన ట్యూనింగ్‌తో రానుంది. మూడు సిలిండర్ల ఈ ఇంజిన్ సుమారు 110 హెచ్‌పీ పవర్ & 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్‌గా 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

ఈ కొత్త టర్బో ఇంజిన్‌తో బ్రెజ్జాకు మరో కీలక ప్రయోజనం కూడా లభించనుంది. సబ్ 4 మీటర్ల పన్ను నిబంధనలకు అనుగుణంగా మారడం వల్ల ధరను పోటీ స్థాయిలో ఉంచేందుకు మారుతికి అవకాశం లభిస్తుంది. దీంతో బ్రెజ్జా ధరలు మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: దేశంలోనే అత్యంత చౌకైన 7 సీటర్ కారు, 2026లో బెస్ట్ సెల్లింగ్ కార్‌ ధర, ఫీచర్లు

కొత్త టర్బో ఇంజిన్‌తో పాటు ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా కొనసాగనుంది. ఇది 103 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తోనే CNG వేరియంట్ కూడా కొనసాగనున్నప్పటికీ, ఇందులో విక్టోరిస్ తరహా అండర్‌బాడీ CNG ట్యాంక్ సెటప్‌ను అందించే అవకాశం ఉంది. దీంతో బూట్ స్పేస్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

ధరలుప్రస్తుతం బ్రెజ్జా ఎక్స్ షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల వరకు ఉంది. కొత్త టర్బో ఇంజిన్ & అధునాతన ఫీచర్లు వచ్చినప్పటికీ, సబ్ 4 మీటర్ల ట్యాక్స్ ప్రయోజనం కారణంగా ధరను పెద్దగా పెంచే అవకాశం లేదు. కొత్త బ్రెజ్జా విడుదలైన తర్వాత హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ & కియా సైరస్ వంటి SUVలకు పోటీగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.