CPM Cadre Returning Bengal:   పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా  వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ నేడు తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని  నిలబెట్టేందుకు పడుతున్న ఆరాటం, సీనియర్ నేతల్లో తీవ్ర తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. అధికారం పోవడంతో పార్టీ ముఖ్యనేతలందా గుడ్ బై చెప్పేశారు.  ప్రతిపక్ష రాజకీయ శూన్యత  స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సీపీఎంకు ఓ మంచి అవకాశంగా కనిపిస్తోంది.  

Continues below advertisement

సీపీఎంకు మళ్లీ ఆశలు

ఈ రాజకీయ పరిణామం సుదీర్ఘకాలం 34 ఏళ్లు  రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ  CPI-M కి, లెఫ్ట్ ఫ్రంట్‌కు చారిత్రాత్మక అవకాశాన్ని తలుపు తడుతోంది. 2011లో మమతా తుఫాన్‌లో అధికారం కోల్పోయిన తర్వాత, సురక్షిత స్థావరం కోసం సీపీఎం కేడర్ పెద్ద ఎత్తున బిజెపి, టిఎంసి వైపు వలస వెళ్లారు.  అయితే, గ్రామీణ బెంగాల్‌లో సీపీఎం నిశ్శబ్ద మూలాలు, సైద్ధాంతిక బలగాలు నేటికీ చెక్కుచెదరలేదు. తమ ఉనికిని కాపాడుకోవడానికి తాత్కాలికంగా ఇతర జెండాలు పట్టిన శ్రేణులు, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం, మమతా పార్టీ నిర్వీర్యం అవుతున్న సూచనలు కనిపిస్తూండటంోత మళ్లీ  ఎర్రజెండా  వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

Continues below advertisement

క్యాడర్ ను సమీకృతం చేసుకునే ప్రయత్నాల్లో లెఫ్ట్ నేతలు

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ నేతలు పాత పద్ధతులను విడనాడి, కొత్త వ్యూహాలతో శ్రేణులను జాగృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.  మీనాక్షి ముఖర్జీ  వంటి అత్యంత ప్రజాదరణ పొందిన యువనాయకులను ముందుంచి,  కార్మికులు-రైతులు-యువత అజెండాతో బెంగాల్‌ను కాపాడుకుందాం  పేరిట విస్తృత పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.  మత-కులాతీత రాజకీయాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా సీపీఎం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.

కాంగ్రెస్ ను వదిలేసి పోరాడితేనే !

అయితే, సైద్ధాంతికంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, ఆచరణలో సీపీఎం ముందు కొండంత సవాళ్లు నిలిచాయి. దశాబ్దకాలంగా అమానుష దాడులకు గురై దెబ్బతిన్న గ్రామస్థాయి కార్యకర్తలకు  మాస్ ప్రొటెక్షన్ కల్పించడంలో పార్టీ అగ్రనాయకత్వం ఇంకా సంపూర్ణ విశ్వాసాన్ని నింపలేకపోతోంది. పైగా, కాంగ్రెస్ పార్టీతో చేసుకుంటున్న తాత్కాలిక పొత్తులు క్షేత్రస్థాయిలో ఓటర్లలో కొంత అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. తమ పూర్వపు ఓటు బ్యాంకును ఆకర్షించడంలో లెఫ్ట్ ఫ్రంట్ వేస్తున్న అడుగులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇంకా చాలా పోరాటం  చేయాల్సిఉంది.  తృణమూల్ ఎంత బలహీనపడితే సీపీఎంకు అంత మేలు జరుగుతుంది. 

ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్లుగా సీపీఎం మారితేనే !           

 పశ్చిమ బెంగాల్‌లో స్థానిక సమస్యలపై పోరాడే అసలైన ప్రతిపక్షంగా అవతరించే అర్హత, సైద్ధాంతిక పునాది సీపీఎంకి మాత్రమే ఉన్నాయి. బీజేపీ వైపు వెళ్లిన తమ పాత ఓటర్లను ఇంటికి రప్పించడంలోనూ, యువతలో  ఉపాధి రాజకీయాల  పట్ల నమ్మకం కలిగించడంలోనూ సీపీఎం నేతలు ఎంతవరకు సఫలమవుతారో అనే దానిపైనే బెంగాల్‌లో ఎర్ర సూర్యుడి పునరాగమనం ఆధారపడి ఉంటుంది.