Tata Sierra 2025 Launch Features: టాటా మోటర్స్‌ చాలా ఏళ్లుగా టీజ్‌ చేస్తూ, కాన్సెప్ట్‌లను చూపిస్తూ వచ్చిన కొత్త తరం 2025 టాటా సియేరా ఇప్పుడు అధికారికంగా ప్రత్యక్షమైంది. 2003లో నిలిపివేసిన ఐకానిక్‌ సియేరా పేరు మళ్లీ రోడ్లపైకి రాబోతోందన్న ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈసారి డిజైన్‌, టెక్నాలజీ, ఇంజిన్‌ ఆప్షన్‌లు.. అన్నీ పూర్తి కొత్త తరానికి తగిన SUVలా తీర్చిదిద్దారు. ధరలను నవంబర్‌ 25న ఈ కారును లాంచ్‌ చేస్తారు, అదే రోజున ధరలు ప్రకటించనున్నారు.

Continues below advertisement

బాక్సీ డిజైన్‌, పూర్తిగా ఆధునిక స్టైలింగ్‌కొత్త సియేరా మొదటి చూపులోనే బాక్సీ సిల్హౌట్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో ఉన్న కాంట్రాస్టింగ్‌ గ్లోస్‌-బ్లాక్‌ ప్యానెల్‌లో కనెక్టెడ్‌ LED DRLs, ప్రొజెక్టర్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, మధ్యలో బ్రైట్‌గా కనిపించే టాటా లోగో - ఈ మొత్తం సెటప్‌ SUVకి ప్రీమియం టచ్‌ ఇస్తుంది.

బంపర్‌ మీద గ్లోస్‌-బ్లాక్‌ యాక్సెంట్స్‌, ఫో కార్నర్లలో పిక్సెల్‌-స్టైల్‌ LED ఫాగ్ ల్యాంప్స్‌, కింద ఫౌక్స్‌ సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌ కలిపి లుక్‌ను అగ్రెసివ్‌ & మోడ్రన్‌గా చూపిస్తున్నాయి.

Continues below advertisement

సైడ్‌ ప్రొఫైల్‌లో ఫ్లష్‌-టైప్‌ డోర్‌ హ్యాండిల్స్‌ ఈ SUVని మరింత స్టైలిష్‌గా చూపిస్తాయి. పాత సియేరాలో ఉండే కర్వ్డ్‌ గ్లాస్‌ ఇప్పుడు లేనప్పటికీ, B-C పిల్లర్‌ల మధ్య ఇచ్చిన బ్లాక్‌ ప్యానెల్‌ అదే వైబ్‌ను ఇస్తోంది. 19-ఇంచ్‌ అల్లాయ్ వీల్స్‌, రగ్గ్డ్‌ బాడీ క్లాడింగ్‌, బ్లాక్‌ రూఫ్‌ రైల్స్‌ అన్నీ కలిసి ఇది నగర రోడ్లకైనా, హైవేలకు అయినా ఫిట్‌గా కనిపిస్తుంది.

వెనుక భాగంలో ఫుల్‌-విడ్త్‌ LED టెయిల్‌ లైట్‌ బార్‌ ఈ SUVని క్లాస్‌గా నిలబెట్టింది. ముందు ఉన్నట్లే వెనుక బంపర్‌లో కూడా గ్లోస్‌-బ్లాక్‌ డిజైన్‌ & స్కిడ్‌ ప్లేట్‌ ఉన్నాయి.

మూడు స్క్రీన్‌లు, ప్రీమియం ఇంటీరియర్‌కేబిన్‌లో వైపు చూడగానే మొదట కనిపించేవి మూడు పెద్ద స్క్రీన్‌లు, అవి - డ్రైవర్‌ డిస్‌ప్లే, రెండు ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌లు. స్క్రీన్‌ల మధ్య కంటెంట్‌ సింక్‌ అవడం SUV వాడకాన్ని మరింత సులభంగా మారుస్తుంది. టాటా కర్వ్వ్‌లో లభించే ఫోర్‌-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ ఇక్కడ కూడా ఉంది; మధ్యలో వెలిగే టాటా లోగో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

పనోరమిక్‌ సన్‌రూఫ్‌ C-పిల్లర్‌ వరకు విస్తరించి కేబిన్‌ను మరింత విశాలంగా, ఫ్రెష్‌ ఎయిర్‌లో ఉన్నట్లు ఫీల్‌ అయ్యేలా చేస్తుంది. ఐదు సీట్లు, బెజ్-గ్రే డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌, అన్ని సీట్లకు అడ్జస్టబుల్‌ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. త్రీ-పాయింట్‌ సీట్‌బెల్ట్‌లు ఫ్యామిలీ కోసం మంచి అదనపు భద్రత.

2025 టాటా సియేరా ప్రధాన ఫీచర్లు:

  • డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌
  • వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జర్‌
  • ఎలక్ట్రిక్‌ & వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు
  • రియర్‌ సన్‌షేడ్స్‌
  • 360-డిగ్రీ కెమెరా
  • లెవల్‌-2 ADAS
  • ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌

ఇంజిన్‌ ఆప్షన్‌లుకొత్త సియేరా, టాటా మోటర్స్‌ ఫ్లాగ్‌షిప్‌ 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో రాబోతోంది. ఇది సుమారు 170hp, 280Nm పవర్‌ను ఇస్తుంది. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ రెండు ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఇక, కస్టమర్లు తక్కువ ధరలో తీసుకునేలా 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ మోటర్‌ కూడా ఇస్తున్నారు.

అదనంగా, Tata Curvv, Tata Nexon లో వాడుతున్న 1.5 లీటర్‌ డీజిల్‌ (118hp, 260Nm) ఆప్షన్‌ కూడా లభ్యం.

ధరలు ఎంత? ఏపీ & తెలంగాణ మార్కెట్‌లో ఎలా ఉండొచ్చు?నవంబర్‌ 25న అధికారిక ధరలు వెలువడతాయి. ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్‌ చూస్తే, ₹11–20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో ప్రారంభ ధరలు సుమారు ఇదే రేంజ్‌లో ఉంటాయని అంచనా.

Hyundai Creta, Maruti Grand Vitara, Honda Elevate, Mahindra Scorpio N రేంజ్‌లోకి కొత్త, స్టైలిష్‌, ఫీచర్‌-రిచ్‌ SUV రానుంది. టాటా సియేరా పేరు మళ్లీ ప్రజల్లో హైప్‌ క్రియేట్‌ చేసేలా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.