2024 Mahindra XUV 3XO SUV: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కారు ఏప్రిల్ 29వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. అయితే అధికారిక లాంచ్‌కు ముందే ఎంపిక చేసిన మహీంద్రా డీలర్లు దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుకింగ్ చేసుకోవచ్చు.


ఈ కారు గురించి హైప్ పెంచడం కోసం కంపెనీ డిజైన్ వివరాలు, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను రివీల్ చేసే టీజర్‌లను విడుదల చేసింది. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో దాని సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చిన మొదటి కారు. ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్న అత్యంత చవకైన కారు కూడా అవుతుందని ఈ టీజర్ ప్రకారం చెప్పవచ్చు.


ఇంటీరియర్, ఫీచర్లు ఇలా...
తాజా మీడియా నివేదిక ప్రకారం కొత్త సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని సపోర్ట్ చేసే కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఇది మాత్రమే కాకుండా 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఈ కారులో ఉండనుంది.






Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!


డిజైన్ పరంగా కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇప్పటికే ఉన్న ఎక్స్‌యూవీ300 నుంచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రాబోయే మహీంద్రా బీఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో డిజైన్‌ల మధ్య కొన్ని పోలికలు ఉంటాయి. ముందు భాగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ తరహాలో రీడిజైన్ చేసిన గ్రిల్, డ్యూయల్ బ్యారెల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇన్వర్టెడ్ సి-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌తో అప్‌డేట్ చేసిన బంపర్ లభిస్తాయి. ఇది కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ట్వీక్డ్ బంపర్, కొత్త ఫుల్ వైడ్ ఎల్ఈడీ టైల్‌లైట్లు, మహీంద్రా ట్విన్ పీక్ లోగోతో అప్‌డేట్ చేసిన టెయిల్‌గేట్ కూడా లభిస్తాయి.


దీని ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్‌లను పూర్తిగా అప్‌డేట్ చేయనున్నారు. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇప్పటికే ఉన్న 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో ఇంజిన్లతో రానుంది. 1.2 లీటర్ టీజీడీఐ గ్యాసోలిన్ యూనిట్ ప్రత్యేకంగా ఐసిన్ సోర్స్డ్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లాంచ్ కానుంది. అదనంగా కస్టమర్లు 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా ఎంచుకోవచ్చు.






Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?