New Bikes in India: ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో కొత్త బైక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ కొందరికి లేటెస్ట్ బైక్స్ కొనుగోలు చేయాలని ఆశగా ఉంటుంది. ఒకవేళ మీరు అలా కొత్త బైక్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే 2024 జనవరిలో మార్కెట్లోకి విడుదల చేసిన మంచి కార్ల గురించి తెలుసుకుందాం.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ (Hero Xtreme 125R)
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌కి పవర్ ఇవ్వడానికి ఒక కొత్త 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ స్ప్రింట్ కౌంటర్‌బ్యాలెన్స్‌డ్ ఇంజన్ అందించారు. ఈ బైక్ 8250 ఆర్పీఎం వద్ద 11.55 పీఎస్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఒక లీటరు పెట్రోలుకు 66 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని పేర్కొన్నారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.99,500 నుండి ప్రారంభమవుతుంది.
హోండా ఎన్ఎక్స్500 (Honda NX500)
హోండా సీబీ500ఎక్స్ లాగానే ఎన్ఎక్స్500 కూడా 471 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 8,600 ఆర్పీఎం వద్ద 47.5 పీఎస్ పవర్‌ను, 6,500 ఆర్పీఎం వద్ద 43 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. ఈ ఏడీవీ షోవా 41 ఎంఎం ఇన్వర్టెడ్ ఫోర్క్, ఐదు దశల ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ ప్రో లింక్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో రానుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.90 లక్షలుగా ఉంది.
హస్క్వర్నా స్వర్ట్పిలెన్ 401 (Husqvarna Svartpilen 401)
హస్క్వర్నా స్వర్ట్పిలెన్ 401 మోటార్‌సైకిల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.92 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలో ఒకే వేరియంట్, సింగిల్ కలర్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్ 398.63 సీసీ బీఎస్6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 46 పీఎస్ పవర్, 39 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 171.2 కిలోలు కాగా, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లుగా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (Royal Enfield Shotgun 650)
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.59 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలో మూడు వేరియంట్లు, నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని హై ఎండ్ వేరియంట్ ధర రూ. 3.73 లక్షలుగా నిర్ణయించారు. షాట్‌గన్ 650లో 648 సీసీ బీఎస్6 ఇంజిన్ అందించారు. ఈ బైక్ 47.65 పీఎస్ పవర్‌ని, 52 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డిస్క్ ఫ్రంట్ బ్రేక్, డిస్క్ రియర్ బ్రేక్ ఉన్నాయి.
జావా 350 (Jawa 350)
జావా 350 మోటార్‌సైకిల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.15 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలో ఒక వేరియంట్, మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. జావా 350లో 334 సీసీ బీఎస్6-2.0 ఇంజిన్‌ను అందించారు. ఇది 22.57 పీఎస్ పవర్‌ని, 28.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డిస్క్ ఫ్రంట్ బ్రేక్, డిస్క్ రియర్ బ్రేక్ ఉన్నాయి. దీని బరువు 194 కిలోలు కాగా, 13.2 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది.