2024 BYD Atto 3 Unveiled: చైనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ బిల్డ్ యువర్ డ్రీమ్స్ (బీవైడీ) ప్రపంచవ్యాప్తంగా అట్టో 3 అప్‌డేటెడ్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇందులో కొత్త డిజైన్, కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ కారుకు సంబంధించిన ఎక్స్‌టీరియర్, ఇంటీరియల్లో స్వల్ప మార్పులు చేశారు.


2024 బీవైడీ అట్టో 3 ఎక్స్‌టీరియల్ అప్‌డేట్
అప్‌డేటెడ్ అట్టో 3 కొత్త 'కాస్మోస్ బ్లాక్' పెయింట్ స్కీమ్‌తో బోల్డ్ లుక్‌ని పొందింది. క్రోమ్ యాక్సెంట్‌లకు బదులుగా ఇది కిటికీలు, డీ-పిల్లర్స్ చుట్టూ నిగనిగలాడే నలుపు రంగును పొందుతుంది. 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' బ్యాడ్జ్ స్థానంలో చిన్న 'బీవైడీ' లోగోతో టెయిల్‌గేట్‌పై బ్రాండింగ్‌ను కంపెనీ రిఫ్రెష్ చేసింది. అదనంగా కొత్తగా రూపొందించిన 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఈవీలో అందించారు.


2024 బీవైడీ అట్టో 3 ఇంటీరియర్ అప్‌డేట్
2024 బీవైడీ అట్టో 3 ఇంటీరియర్స్ విషయానికి వస్తే... ఇటీవల లాంచ్ అయిన ‘సీల్’ కారులో అందించిన పెద్ద స్క్రీన్‌ను ఈ కారులో కూడా ఇచ్చారు. ఇది మధ్యలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. దీన్ని ల్యాండ్‌స్కేప్ లేదా పొర్‌ట్రెయిట్‌ మోడ్స్‌లో ఉపయోగించవచ్చు. ఇంటీరియర్ కలర్ స్కీమ్ కొత్త డార్క్ బ్లూ, బ్లాక్ థీమ్‌తో అప్‌డేట్ చేశారు. దీన్ని బయటి వైపున కూడా చూడవచ్చు. అదనంగా ఈ ఈవీ కొత్త 'ఇంటెలిజెంట్ స్టార్ట్' సిస్టమ్ వంటి స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. ఇది డ్రైవర్‌ను బ్రేక్ పెడల్‌ను నొక్కడం ద్వారా స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది.


2024 బీవైడీ అట్టో 3 మిగతా ఫీచర్లు
2024 బీవైడీ అట్టో 3లో 60.48 కేడబ్ల్యూహెచ్ బ్లేడ్ బ్యాటరీని అందించారు. ఇది సింగిల్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఒక్క సారి ఛార్జింగ్ పెడితే ఆగకుండా 521 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఉపయోగించవచ్చు.


2024 బీవైడీ అట్టో 3 ధర, లాంచ్ టైమ్‌లైన్
ఈ సరికొత్త బీవైడీ అట్టో 3 మోడల్ ఇంకా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కాలేదు. అందువల్ల దీని ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే అప్‌డేట్ చేసిన బీవైడీ అట్టో 3 గ్లోబల్ లాంచ్ అయిన వెంటనే భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని అనుకోవచ్చు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!