2024 Bajaj Pulsar N250 Launched Price, Features: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్ డేటెడ్ పల్సర్ N250ని లాంచ్ చేసింది. పల్సర్ బండ్లకి మార్కెట్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం.. ఎన్, ఎఫ్ 250 బైక్‌లను లాంచ్ చేసిన పల్సర్ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ తీసుకురాలేదు. ఇక ఇప్పుడు 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250ని లాంచ్ చేసింది. ఇక త్వరలోనే పల్సర్ F250ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ ఎన్ 250 ఫీచర్స్ ఏంటి? కాస్ట్ ఎంత?
మూడు రంగుల్లో ఎన్ 250..
పల్సర్ 250 లాంచింగ్ టైంలో రెండు కలర్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చింది బజాజ్. అయితే, ఇప్పుడు 2024 ఎన్ 250 లో మాత్రం.. మూడు కలర్ ఆప్షన్స్ లాంచ్ చేశారు. ఎరుపు, నలుపు, తెలుపు లో బైక్స్ రిలీజ్ చేసింది బజాజ్. బ్లాక్ కలర్ బండికి మాత్రం యూఎస్ డీ ఫోర్క్స్ మీద.. బ్లాక్ కలర్ రానుంది, రెడ్, వైట్ కలర్ బండ్లకి యూఎస్ డీ ఫోర్క్స్ మీద గోల్డ ఫినిషింగ్ రానుంది. ఇక ధర విషయానికొస్తే.. ఎన్ 250 ఎక్స్ షోరూమ్ ప్రైజ్.. రూ.1,50,829 గా నిర్ణయించారు. దాని ప్రిసీడింగ్ మోడల్ కంటే దీని ధర కేవలం రూ.1829 మాత్రమే పెరిగింది.
స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 2024 పల్సర్ ఎన్ 50లో USD ఫోర్ట్స్ ఉన్నాయి. టర్న్- బై - టర్న్ నావిగేషన్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చింది ఈ మోటార్‌సైకిల్. ఇక ఈ మోటర్ సైకిల్‌కు 140 - సెక్షన్ వెనుక టైర్ ఉంది. ఇది రైడ్ ఎబిలిటీని పెంచుతుంది. యూఎస్ ఫ్రంట్ ఫోర్కలు, టైర్ మోటర్ సైకిల్ మస్కులార్ అప్రోచ్ విధానాన్ని కలిగిస్తాయి.
2024 ఎన్ 250కి బజాజ్ ఆటో.. మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసింది. సేఫ్టీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంది. ఆఫ్ రైడ్ ఏబీఎస్ మోడ్‌లో ఉన్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఆఫ్ చేసే విధంగా రూపొందించింది. ఇక మొదటిసారి బజాజ్ పల్సర్ లో ఏబీఎస్ రైడింగ్ మోడ్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఏబీఎస్ మోడ్‌ను మూడుగా ఇచ్చింది. రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ మోడ్‌లో ఇచ్చింది. ఇక ట్రాక్షన్ కంట్రోల్ కాకుండా, మీరు ఆఫ్-రోడ్ మోడ్‌లో కూడా వెనుక చక్రం వద్ద ABSని ఆఫ్ చేయలేరు.
ఇక 2024 పల్సర్ ఎన్ 250 మోడల్‌కు పవర్ ట్రైన్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత వాటికి ఉన్నట్లుగానే 249.07 సీసీ సింగి ఇంజిన్ అందించారు, ఆయిల్ కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ 8,750 rpm వద్ద 24.5 PS గరిష్ట శక్తిని , 6,500 rpm వద్ద 21.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 5-స్పీడ్ స్థిరమైన మెష్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. బైక్‌లో స్లిప్, అసిస్ట్ క్లచ్‌ని అమర్చారు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?