హ్యుండాయ్ వెన్యూ కొత్త మోడల్ జూన్ 16వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కంపెనీ వెబ్‌సైట్లో రూ.21,000 చెల్లించి 2022 వెన్యూని బుక్ చేసుకోవచ్చు. ఇందులో బోలెడన్ని కొత్త ఫీచర్లను వెన్యూ అందించింది.
హోం టు కార్ విత్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, 60కి పైగా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు, వెనకవైపు రిక్లైనర్ సీట్లు ఇందులో ఉన్నాయి. హోం టు కార్ ద్వారా వినియోగదారులకు రిమోట్ క్లైమెట్ కంట్రోల్, రిమోట్ డోర్ లాక్/అన్‌లాక్, ఫైండ్ మై కార్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ లెవల్ ఇన్ఫర్మేషన్, స్పీడ్ అలెర్ట్, టైమ్ ఫెన్సింగ్ అలెర్ట్, ఐడిల్ టైం అలెర్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఈ, ఎస్, ఎస్+/ఎస్(వో), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(వో) వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ఆరు సింగిల్ టోన్, ఒక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో కొత్త వెన్యూని కొనుగోలు చేయవచ్చు. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, డెనిమ్ బ్లూ, ప్లాటినం బ్లాక్, పోలార్ వైట్, ఫీరీ రెడ్ వేరియంట్లు ఉన్నాయి. ఫీరీ రెడ్ ఆప్షన్‌లో ఫాంటం బ్లాక్ రూఫ్ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు.
మొత్తం 10 రీజనల్ లాంగ్వేజెస్‌ను హ్యుండాయ్ వెన్యూ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం సపోర్ట్ చేయనుంది. ఈ కారు ఇటీవలే మూడు లక్షల సేల్స్ మార్కును దాటింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ అధికారికంగా ప్రకటించింది.
లాంచ్ అయిన మొదటి ఆరు నెలల్లోనే హ్యుండాయ్ వెన్యూ 50 వేల మార్కును దాటింది. 2020 జూన్ నాటికి ఈ కారు సేల్స్ లక్ష మైలురాయిని చేరుకుంది. 2021 డిసెంబర్ నాటికి 2.5 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే కేవలం తర్వాతి ఆరు నెలల్లోనే మరో 50 వేల యూనిట్లు అమ్ముడుపోయాయన్న మాట.
2022లో లాంచ్ కానున్న కొత్త వెన్యూ విజువల్‌గా కూడా అప్‌గ్రేడ్ కానుంది. ముందువైపు పెద్ద గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ అందించారు. కొత్త వెన్యూలో 1.2 లీటర్ నాచురల్లీ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ యూనిట్ 82 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?