Hyderabad Crime : గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్.ఆర్.నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బి.కె గూడా పార్క్ వద్ద విషాల్ పటేల్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన ధర్మేష్ భాయ్ గౌలిగూడలో నివాసం ఉంటూ ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.  Betbhai9.com పేరుతో ఉన్న వెబ్ సైట్ ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆన్ లైన్ ద్వారా గేమ్స్ ను ఆడుకునేలా ఏర్పాటుచేశారు.


బెట్టింగ్ లో గెలిస్తే ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ 


ఈ యాప్ లో రూ 50 వేల వరకు ట్రాన్సాక్షన్ జరిపేందుకు అవకాశం కల్పించి, రూ50 వేల పై నుంచి 15 లక్షల వరకు పందెం నిర్వహించే వారు నేరుగా నగదు చెల్లించి ఆడుకునేలా ఏర్పాటు చేశారు.  ఇలా పందెంలో పాల్గొనే వారి వద్ద నుంచి ధర్మేష్ నియమించిన ఏజెంట్లు పందెం కాసే వ్యక్తుల నుంచి డబ్బును తీసుకొస్తుంటారు. బెట్టింగ్ లో గెలుపొందిన వ్యక్తికి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతారు. డబ్బు అధిక మొత్తంలో ఉంటే నేరుగా ఏజెంట్లు బెట్టింగ్ వ్యక్తులకు అందజేస్తారు. బీకే గూడా పార్క్ సమీపంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా గౌలిపుర కేంద్రంగా భారీ స్థాయిలో బెట్టింగ్ కొనసాగుతున్నట్లు బయటపడింది.


రూ.కోటి 15 లక్షలు స్వాధీనం


దీంతో పోలీసులు గౌలిపురలోని బెట్టింగ్ కేంద్రానికి వెళ్లి తనిఖీ చేయగా రూ. కోటి 13 లక్షల రూపాయల నగదు లభించింది. బీకే గూడా పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద రెండు లక్షలతో కలిపి మొత్తం కోటి 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విశాల్ పటేల్, కమలేష్, పటేల్ హితేష్ అంబాలాలను అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ధర్మేష్ భాయ్ కోసం గాలింపు చేపట్టారు. 


Also Read : Krishna News : కూర విషయంలో భార్యతో గొడవ, ఆత్మహత్య చేసుకున్న భర్త!


Also Read : Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !