శాంసంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్. ఈ ఫోన్ ఇటీవలే గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కనిపించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 3 జీబీ ర్యామ్ ఇందులో ఉన్నాయి. 6.5 అంగుళాల డిస్‌ప్లే కూడా అందించారు.
SM-A047F మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ గీక్ బెంచ్‌లో కనిపించింది. ఇదే గెలాక్సీ ఏ04ఎస్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రెండర్లు, స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు గీక్ బెంచ్‌లో చూడవచ్చు. ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 152 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 585 పాయింట్లను సాధించింది. ఇందులో వీ-ఆకారంలో నాచ్ ఉన్న 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ షూటర్లు ఉన్నాయి.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంలపై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!