హోండా మనదేశంలో కొత్త కారు లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. అదే హోండా సిటీ హైబ్రిడ్. ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు. ఈ కారు ఏప్రిల్ 14వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సిటీ ఈ:హెచ్ఈవీ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. హోండా సిటీలో టాప్ రేంజ్ కారు ఇదే.


ఇది హైబ్రిడ్ కారు కాబట్టి ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఇవి ఇంటర్నల్‌గా పెట్రోల్ ఇంజిన్‌కు కనెక్ట్ అవ్వనున్నాయి. ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్లలో ఇవి లాంచ్ కానున్నాయి. ఇందులో ఒక ఇంజిన్, ఒక ఇన్వర్టర్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఒక చిన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్ ఉండనున్నాయి.


ఈవీ డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్లు ఇందులో ఉండనున్నాయి. ఈవీ డ్రైవ్ మోడ్‌లో ఇంజిన్‌ను ఎలక్ట్రికల్ పవర్‌తో నడిపించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఇది కూడా ఒకటి. ఒక లీటరు పెట్రోల్‌కు ఏకంగా 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇది. ఇవి ఓవర్సీస్ మోడల్ ఫీచర్లు. మనదేశంలో ఫీచర్ల గురించి తెలియాలంటే లాంచ్ అయ్యే వరకు ఆగాల్సిందే.


అయితే ఈ కారు ఇండియన్ వెర్షన్‌కు స్టైలింగ్ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. మిగతా సిటీ వేరియంట్ల కంటే దీని డిజైన్, బ్యాడ్జింగ్ కొత్తగా ఉండనుంది. దీంతోపాటు కారు టెక్నాలజీ, ఇతర ఫీచర్లలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కారు ధర ఎంతగా ఉండనుందనే విషయంలో మాత్రం ఇంకా తెలియరాలేదు.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?