Mahesh Babu - Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రీకరణ చేస్తున్న మహేష్, త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలనేది ప్లాన్. ఆర్ఆర్ఆర్' విజయాన్ని ఆస్వాదిస్తున్న దర్శక ధీరుడు, త్వరలో మహేష్ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయనున్నారు.


800 crore budget for Rajamouli Mahesh Babu Movie?: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే... బడ్జెట్ గురించి కొంత మంది డిస్కషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సుమారు 800 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమా తెరకెక్కనుందని తెలిపారు. ఇండియన్ బాక్సాఫీస్ స్టామినా రెండు వేల కోట్ల రూపాయలు కాబట్టి... 800 కోట్లు పెట్టడానికి నిర్మాత ముందుకు వస్తున్నట్టు తెలిపారు. అయితే... ఈ వార్తలను రాజమౌళి తండ్రి, రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ కొట్టి పారేశారు.


KV Vijayendra Prasad On Mahesh Babu - Rajamouli movie: "కథే లేకుండా బడ్జెట్ ఎక్కడ నుంచి వస్తుంది? బయట ఏవో నడుస్తూ ఉంటాయి. అయితే... అది (మహేష్ - రాజమౌళి సినిమా) బిగ్ బడ్జెట్ మూవీ. అందులో మరో సందేహం అవసరం లేదు" అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సినిమా కోసం కొన్ని ఐడియాలు అనుకుంటున్నామని, స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.


Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?


Rajamouli On His Movie with Mahesh Babu: రాజమౌళి సైతం మహేష్ బాబుతో చేయబోయే సినిమా కథ పూర్తి కావడానికి ఏడెనిమిది నెలలు పడుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఏడాది ఆఖరున సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను కె.ఎల్. నారాయణ (Mahesh Babu Rajamouli movie producer) నిర్మించనున్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ ఇండియా (Mahesh Babu First Pan India Movie) మార్కెట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హిందీలో ఆయనకు అభిమానులు ఉన్నప్పటికీ... ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమా చేయలేదు.  


Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!