Hyundai Creta Facelift Sale Report: హ్యుందాయ్ క్రెటా చాలా నెలలుగా SUV సెగ్మెంట్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. ఇతర కార్ల  కంపెనీలు ఈ ఎస్‌యూవీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. గట్టి పోటీని ఇవ్వలేక పోతున్నాయి. జనవరి 2024లో ఈ ఎస్‌యూవీ అప్‌డేటెడ్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో హ్యుందాయ్‌ లాంచ్‌ చేసింది.  ఈ హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ (Hyundai Creta Facelift) కేవలం ఆరు నెలల్లోనే 1 లక్షలకు పైగా యూనిట్లను సేల్‌ చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది.


హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది. ఇటీవలె విడుదలైన సేల్స్ రిపోర్ట్‌ ప్రకారం క్రెటా రోజుకు దాదాపు 550 యూనిట్లు అమ్ముడవుతున్నట్లు తేలింది. గత కొన్ని నెలలుగా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో దీని దరిదాపుల్లో ఇతర ఎస్‌యూవీలు లేకపోవడం గమనార్హం. 


ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు


ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా పూర్తి అప్‌డేట్స్‌తో మరింత ప్రీమియం కారుగా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో కనెక్ట్ చేయబడిన LED DRLలు, కొత్త బంపర్ మరియు ఆకర్షణీయమైన గ్రిల్ సెక్షన్ ఉన్నాయి. కారులో 10.25-అంగుళాల స్క్రీన్ (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ స్క్రీన్), వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.


అదనంగా.. ఇది క్విక్ క్యాబిన్ కూలింగ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ పవర్ సీట్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్‌, AC వెంట్స్‌ని అందిస్తుంది. ఇక సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్‌ EBD, 360-డిగ్రీల వెనుక కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్ 2 ADAS ఫీచర్లు ఉన్నాయి.


ఇంజిన్ ఆప్షన్స్‌ & ధర


కొత్త హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తుంది. వీటిలో 115 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ నేచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్, 160 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 116 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. క్రెటా SUV చాలా కాలంగా భారతీయులకు ఇష్టమైన మోడల్ కావడంతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లోనూ మంచి డిమాండ్‌ని కలిగి ఉంది. దీనికి ఉన్న డిమాండ్‌ ఆధారంగా ఇప్పుడు బుక్‌ చేసుకుంటే వేరియంట్‌ని బట్టి డెలివరీ కోసం 6 నెలలు ఆగాల్సి ఉంటుంది. కొన్ని సార్లు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.


తిరుగులేని ఆధిపత్యం..

మెరుగైన ఫీచర్లు, డిజైన్‌తో వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు క్రెటా యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థ ప్రవేశపెట్టబడింది. పూర్తి అప్‌డేట్‌తో వచ్చిన ఈ వెర్షన్‌ విడుదల నుంచే సేల్స్‌లో దుమ్మురేపుతుంది. ఈ ధరలో ఇతర ఎస్‌యూవీలతో పోల్చితే ప్రీమియం ఫీచర్లను అందింస్తుడంతో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లోనూ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల కంటే ఈ క్రెటా మోడళ్లు టాప్‌ ప్లేస్‌లోనే దూసుకెళ్తుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.