Zodiac Signs: పెళ్లైన వాళ్లంతా సంతోషంగా ఉన్నారనుకుంటే పొరపాటే..ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అడ్జెస్ట్ మెంట్ కూడా తప్పదు. అంత గొడవల మధ్య బంధాన్ని వదులేసుకోవచ్చుకదా అంటారేమో...వదులుకునేంత పెద్ద సమస్యా కాదు, లైట్ తీసుకోవాల్సినంత చిన్న సమస్యా కాదు. మరి ఇలాంటప్పుడు పరిష్కారం ఏంటి అని అడిగితే..మీ రాశి ప్రకారం మీరు కొన్ని ఫాలో అయితే చాలంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 


మేష రాశి
ఎక్కువగా మేషరాశివారు తన జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయిస్తారు. అందుకే ఈ రాశివారు కోపం తగ్గించుకుని పార్టనర్ కి కూడా ప్రయార్టీ ఇవ్వాలి. సరైన కమ్యూనికేషన్ మెంటైన్ చేయడం మంచిది. అహంకారాన్ని విడిచిపెట్టి ఆప్యాయంగా ఉండడం మంచిది.


వృషభ రాశి
వృషభ రాశి వారు చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండాలి. మీ పార్టనర్‌తో ఎలాంటి గొడవలు అయిన సరే  వీలైనంత త్వరగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే చిన్న చిన్న గొడవలను పట్టించుకోకుండా ఉంటారో అప్పుడు మీ మధ్య రిలేషన్ బావుంటుంది. 


మిధున రాశి 
మిధున రాశి వారు  లైఫ్ పార్టనర్‌తో మంచి రిలేషన్ కావాలి అనుకుంటే కచ్చితంగా మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయాలి. మీ భర్త లేదా భార్యని ఇతరులతో పోల్చొద్దు. మీ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని అంగీకరించండి. కంపేరజన్ వల్ల ఒక్కోసారి మీ మధ్య అనవసర దూరం పెరిగిపోయే ప్రమాదం ఉందని గమనించాలి.


కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారు వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు..చిన్న చిన్న ఇబ్బందులను కూడా బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. వీరి ఆలోచనలు బయటకు చెప్పాలి అనుకున్నా కాస్త సమయం తీసుకుంటారు. కానీ మీ ఆలస్యం కారణంగా పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఆలోచనలను పార్టనర్ తో పంచుకోండి. 


Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!


సింహ రాశి 
సింహ రాశి వారికి రిలేషన్ షిప్‌లో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మీ జీవితభాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించాలి. అంతే కాకుండా మీ మొదటి ప్రయార్టీ మీ పార్టనర్ అవ్వాలి.  అలా బయటకు వెళ్లడం, బహుమతులు కొనుగోలు చేసి ఇవ్వడం వల్ల ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 


కన్యా రాశి 
కన్యా రాశి వారు జీవిత భాగస్వామి అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి. మీ ఎమోషన్స్‌ని పంచుకోవాలి. అలా అయితేనే మీ మధ్య బంధం బాగా పెరుగుతుంది. అనవసర చర్చలకు అస్సలు అవకాశం ఇవ్వొద్దు


తులా రాశి 
తులా రాశి వారు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనను బాగా అర్థం చేసుకోవాలి. వారి మూడ్ ని అర్థం చేసుకుని నడుచుకోవడం చాలా మంచిది. ఇలా ఉంటేనే మీ బంధం బలపడుతుంది.


వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారు మీ పార్టనర్ తో సమయాన్ని గడిపేటప్పుడు, మీ ఆలోచనలు పంచుకునేటప్పుడు ప్రశాంతంగా, సున్నితంగా డీల్ చేయాలి. మీరు ఎంత కూల్ గా వ్యవహరిస్తే మీ బంధం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రొఫెషనల్  - పర్సనల్ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి.


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారు మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం మానేయాలి. పదే పదే అవే విషయాలు ప్రస్తావిస్తే మీ పార్ట్నర్‌తో మీ బంధం మరింత బాగుంటుంది. జరిగిపోయిన సంఘటనల గురించి  అనవసరంగా ఆలోచించి ఆ ప్రభావం మీ పార్టనర్ పై పడేలా చేయకండి. 


మకర రాశి 
మకర రాశి వారికి పార్ట్నర్‌తో రిలేషన్ బాగుండాలంటే అనవసర బాధ్యతలను తలకెత్తుకోకండి. బాధ్యతలకు బంధీగా ఉండనంత వరకూ మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 


కుంభ రాశి 
కుంభ రాశి వారు ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. ఏ నిర్ణయాన్ని కంగారుపడి తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించాకే ఓ నిర్ణయానికి రావాలి. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయం పంచుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు, మీ మధ్య అపార్థాలకు తావుండదు.


మీన రాశి 
మీన రాశి వారికి వాళ్ళ పార్ట్నర్‌తో మంచి ప్రేమని పంచుకోవాలని ఉంటుంది. వారి నుంచి కూడా సపోర్ట్ ఆశిస్తారు. ప్రతి విషయం చెప్పాలని ఆశపడతారు, చెప్పాక చాలా ఆనందపడతారు. ముఖ్యంగా ఈ రాశివారికి పార్టనర్ ప్రతి సందర్భంలోనూ భాగం అవ్వాలని కోరుకుంటారు. కానీ కోపం కారణంగా మొత్తం పోతుందని గ్రహించాలి