Yearly Horoscope 2026 : 2025 సంవత్సరం పూర్తవుతోంది. గడిచిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2026 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారంతా. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం చాలామంది అదృష్టాన్ని మార్చబోతోంది. కొన్ని రాశులవారికి ధనలాభం, కొంతమందికి ఉద్యోగంలో విజయం లభించే అవకాశం ఉంది, మరికొందరికి ఆనందకరమైన వారం గడుస్తుంది. మేషం నుంచి కన్యా రాశులవారికి మీ వ్యాపారం, కెరీర్, ఆరోగ్యం , ప్రేమ జీవితం ఈ కాలంలో ఎలా ఉంటుంది? 

Continues below advertisement

మేషం నుంచి కన్యా రాశులవారి 2026 సంవత్సర వార్షిక రాశిఫలాలు మేష రాశి (Aries 2026 Yearly Horoscope)

కెరీర్: సంవత్సరం రెండవ భాగం, అంటే జూన్ తర్వాత కెరీర్ అవకాశాలకు చాలా మంచిది. ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఆర్థిక: ఖర్చులు పెరుగుతాయి,ఆదాయానికి కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Continues below advertisement

ఆరోగ్యం: తలనొప్పి  కంటి సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి.

ప్రేమ: సంబంధాలలో ఓర్పు అవసరం. మీ మాటల్లో నిగ్రహం ఉంచండి.

వృషభ రాశి (Taurus 2026 Yearly Horoscope)

కెరీర్: ఉద్యోగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. జూన్ 2026 తర్వాత పదోన్నతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆర్థిక: మీ బ్యాంక్ బ్యాలెన్స్ బలపడుతుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది.

ఆరోగ్యం: మీ ఆహార అలవాట్లను నియంత్రించండి; బరువు పెరగడం ఒక సమస్యగా మారవచ్చు.

ప్రేమ: కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.

మిథున రాశి (Gemini 2026 Yearly Horoscope)

కెరీర్: ఉద్యోగులు, విద్య , మీడియా రంగాలలో పనిచేసేవారికి ఇది స్వర్ణయుగం. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది.

ఆర్థిక: జూన్ తర్వాత డబ్బుల ప్రవాహం చాలా బాగుంటుంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు.

ఆరోగ్యం: మీకు మానసిక శాంతి లభిస్తుంది , దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రేమ: మీ ప్రేమ జీవితం బావుంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది.

కర్కాటక రాశి (Cancer 2026 Yearly Horoscope)

కెరీర్: ఏ రంగంలోనైనా గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం లభించవచ్చు.

ఆర్థిక: సంవత్సరం ప్రారంభం కొంచెం ఖరీదైనదిగా ఉండవచ్చు, అయితే మధ్యకాలం నుంచి ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉంది.

ఆరోగ్యం: మీరు ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రేమ: వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సంతానలేనివారు శుభవార్త వినే అవకాశం

సింహ రాశి (Leo 2026 Yearly Horoscope)

కెరీర్: మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, అయితే ఫలితాలు సంతోషాన్నిస్తాయి. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.

ఆర్థిక: జూన్ 2 తర్వాత ఖర్చులలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. ఖర్చులు నియంత్రించండి

ఆరోగ్యం: పొట్ట, కాళ్ళకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

ప్రేమ: మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు.  .

కన్యా రాశి (Virgo Weekly Horoscope)

కెరీర్: ఈ సంవత్సరం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా మంచిది. కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి.

ఆర్థిక: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు రావచ్చు.

ఆరోగ్యం: చర్మ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి.

ప్రేమ: ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది. మీకు స్నేహితుల నుంచి పూర్తి సహాయం లభిస్తుంది.

 గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.