2025 డిసెంబర్ 23 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 23 December 2025 

Continues below advertisement

మేష రాశి

పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గౌరవం పెరుగుతుంది. సృజనాత్మక ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఈ రోజు మనసుకు నచ్చిన వ్యక్తిని కలుస్తారు. సీరియస్ రిలేషన్‌షిప్ ప్రారంభమవుతుంది.

Continues below advertisement

అదృష్ట సంఖ్య: 9అదృష్ట రంగు: ఎరుపుపరిహారం: హనుమంతుడికి బెల్లం నైవేద్యం పెట్టండి.

వృషభ రాశి

ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో అధికారులు లేదా ఇంటి పెద్దతో వాగ్వాదం జరగవచ్చు. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కెరీర్‌లో కొత్త మార్పు వస్తుంది.

అదృష్ట సంఖ్య: 6అదృష్ట రంగు: తెలుపుపరిహారం: లక్ష్మీదేవికి పాయసం నైవేద్యం పెట్టండి.

మిథున రాశి

సృజనాత్మక ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలలో ఒత్తిడి ఏర్పడవచ్చు.

అదృష్ట సంఖ్య: 5అదృష్ట రంగు: ఆకుపచ్చపరిహారం: గణేశుడికి దూర్వా సమర్పించండి.

కర్కాటక రాశి

ప్రయాణాలు ఆహ్లాదకరంగా  ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో మెరుగుదల ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మహిళా స్నేహితుల నుంచి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

అదృష్ట సంఖ్య: 2అదృష్ట రంగు: తెలుపుపరిహారం: శివలింగానికి పాలతో అభిషేకం చేయండి సింహ రాశి

జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. సృజనాత్మక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రయాణం సాధ్యమే. విద్యార్థులకు రోజు సాధారణంగా ఉంటుంది, కృషి అవసరం.

అదృష్ట సంఖ్య: 1అదృష్ట రంగు: బంగారుపరిహారం: సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించండి.

కన్యా రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆర్థిక వ్యవహారాలలో రిస్క్ తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.  జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు.

అదృష్ట సంఖ్య: 5అదృష్ట రంగు: ఆకుపచ్చపరిహారం: ఆవుకు గ్రాసం వేయండి తులా రాశి

ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, కానీ సహోద్యోగులతో విభేదాలు జరిగే అవకాశం ఉంది అదృష్ట సంఖ్య: 6అదృష్ట రంగు: గులాబీపరిహారం: దుర్గాదేవికి ఎరుపు పువ్వులను సమర్పించండి.

వృశ్చిక రాశి

సృజనాత్మక పనులలో పురోగతి ఉంటుంది. ఈ రోజు ఏదైనా పెద్ద విజయం లభించవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

అదృష్ట సంఖ్య: 9అదృష్ట రంగు: మెరూన్పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

ధనుస్సు రాశి

స్నేహితులు, సన్నిహితుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఓ ప్రత్యేక వ్యక్తి నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సామాజిక కార్యక్రమాలలో ఆసక్తి చూపుతారు. ఓపిక పట్టండి, సమయం అనుకూలిస్తుంది.

అదృష్ట సంఖ్య: 3అదృష్ట రంగు: పసుపుపరిహారం: అరటి చెట్టుకు నీరు సమర్పించండి.

మకర రాశి

వ్యాపార ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ముందుకుసాగుతాయి. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త పనికి ప్రేరణ లభిస్తుంది.

అదృష్ట సంఖ్య: 8అదృష్ట రంగు: నీలంపరిహారం: శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించండి.

కుంభ రాశి

ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కంటి సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. సృజనాత్మక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. పాత నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య: 4అదృష్ట రంగు: ఊదాపరిహారం:  నల్ల నువ్వులను దానం చేయండి.

మీన రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. పిల్లలు లేదా వారి విద్యకు సంబంధించిన ఒత్తిడి ఉండవచ్చు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ఆర్థిక , వ్యాపార పరిస్థితులలో మెరుగుదల ఉంటుంది.  ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది అదృష్ట సంఖ్య: 7అదృష్ట రంగు: పసుపుపరిహారం: విష్ణువును పూజించండి  

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.