Lakshimi Raave Maa Intiki Serial Today Episode: రాఖీ ఫౌర్ణమి రోజు పెద్దయ్య వేకువజామునే నిద్రలేవడంతో ఇంట్లో అందరూ హడలిపోతారు. అప్పటికే భార్య ఇందిర ఆయనకు స్నానం చేయడానికి టవల్ తీసుకుని వచ్చి ఇవ్వగా...పెద్దకుమారుడు వేపపుల్లతో రెడీగా ఉంటాడు. పెద్దకోడలు హైమావతి పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేస్తుంది. చిన్నకుమారుడు అజయ్ గజపతి బావి వద్ద నీళ్లు తోడుతుండగా....పిల్లలు ఇంకా నిద్ర లేవలేదా అంటూ పెద్దయ్య గట్టిగా మందలిస్తాడు. చిన్న కోడలు ఇంటి ముందు నీల్లు చల్లుతుండగా...పండుగ రోజు కూడా మామూలు నీళ్లు చల్లకపోతే...కాస్త పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసి గుమ్మానికి పసుపు,కుంకుమ రాయోచ్చు కదా అని మందలిస్తాడు. సరిగ్గా ఆయన ఏం చెబుతున్నాడో...అదే పని లక్ష్మీ తన ఇంట్లో చేస్తుంటుంది.ఈలోగా తాతయ్య చాదస్తాన్ని మనవళ్లు, మనవరాళ్లు చీదరించుకుంటారు. వాళ్ల అమ్మానాన్న వచ్చి త్వరగా స్నానం చేసి పూజ వద్దకు రావాలని చెప్పి వాళ్లను హడావుడి చేస్తుంటారు. అటు ఇంట్లోనే పోస్టాఫీసు పెట్టుకుని ఉదయం ట్యూషన్లు చెబుతున్న లక్ష్మీ....తన తమ్ముడు, చెల్లిని త్వరగా స్నానం చేసి రెడీ అవ్వమని పురమాయిస్తుంది. తాతయ్య పూజ ముగిసే సమయానికి పెద్దమనవరాలు సింధూజ కిందకు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంది. నేను ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పైకి ఎదిగినప్పుడు నేను ఏది అడిగితే అది ఇస్తానని మీరు మాటిచ్చారని...ఇప్పుడు సంవత్సరం పాటు మీ అందరిమీద ఆధారపడకుండా నేను ఒక్కదాన్నే ముంబయిలో ఉండి వచ్చాని చెబుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్లిపోదామని అనుకుంటున్నానని అంటుంది. నీకు ఏం ఇవ్వాలో..ఎక్కడికి పంపాలో నాకు బాగా తెలుసు తల్లి అని అంటాడు. అందరూ వచ్చినా ప్రియం వద రాకపోయేసరికి పెద్దయ్య కోప్పడతాడు.ఇంతలో భార్య ఇందిరా కేకవేయడంతో కూతురు ప్రియం వద కిందకు వస్తుంది. ఇంతలో పెద్దయ్య అందరితో కషాయం తాగిస్తాడు. ఆయన కండీషన్లకు ఇంట్లో వాళ్లంతా ఇబ్బందిపడుతుంటారు.అటు లక్ష్మీ మాత్రం...ఇంటి చుట్టుపక్కల వాళ్లకు ఆ పనిలో ఈపనిలో సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ల అమ్మ వచ్చి పిలవడంతో వెళ్లి తమ్ముడికి రాఖీ కడుతుంది. అటు పెద్ద ఇంట్లోనూ రాఖీ వేడుకలు సాగుతుంటాయి. ముఖ్యమైన పనిమీద నేను బయటకు వెళ్తాున్నానని..అందరూ ఇంట్లోనే ఉండండని చెప్పి పెద్దయ్య బయటకు వెళ్తాడు.
తన వద్ద ట్యూషన్‌కు వచ్చే పిల్లలతో శ్రీలక్ష్మీ దొంగ ఉత్తరాలు రాయస్తుంటుంది. కొడుకులు కనీసం పట్టించుకోని తల్లులకు వాళ్లు కొడుకులే ఉత్తరాలు రాస్తున్నట్లు రాయించి ఆ తల్లులకు అందజేస్తుంటుంది. దీంతో వాళ్ల కొడుకులే నిజంగా ఉత్తరం రాశారనుకుని సంబరపడిపోతుంటారు. అటు పెద్దయ్య ఇంట్లో చిన్న మనవడు మధుసూదన్‌కు హీరో అవ్వాలని పిచ్చి...దీంతో రకరకాల అబద్ధాలు చెప్పి సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి బయటకు వెళ్లిపోతుంటాడు. పరీక్ష రాయకుండా షూటింగ్‌లో ఉన్న మ్యాడీకి త్రిష ఫోన్ చేస్తుంది. కాసేపట్లో పరీక్ష రాయాల్సి ఉందని ...నువ్వు పరీక్ష రాయకుంటే మీ తాతయ్య వద్ద నీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తుతెచ్చుకో అని హెచ్చరిస్తుంది.