Jagadhatri Serial Today Episode: నిషిక ప్రవర్తనపై జగధాత్రికి అనుమానం ఇంకా తగ్గదు. ఇదే విషయాన్ని కేదార్‌కు చెబుతుంది. నిషి మళ్లీ ఆ మీనన్‌తో చేతులు కలుపిందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తుంది. అర్థం లేని ఆవేశంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్న భయంగా ఉందని ధాత్రి అంటుంది. నిషి మీద ఇప్పటికైతే కేవలం అనుమానం మాత్రమే ఉందని....ఆధారాలు లేకుండా ఏదైనా చేస్తే మరింత గొడవ చేస్తుందని అంటుంది. మీనన్‌ మామయ్యను కిడ్నాప్‌ చేసి యువరాజును భయపెట్టాలని చూశాడని..మన ఇంట్లో వాళ్లను అడ్డుపెట్టుకుని మళ్లీ ఏదో చేయబోతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తుంది. యువరాజు  విషయంలో జరిగిన తప్పు మళ్లీ జరగకూడదని అంటుంది. నిషి మీనన్‌తో చేతులు కలిపింది నిజమే అయితే....ఫుడ్‌ డెలివరీలో వచ్చింది కచ్చితంగా  మీనన్‌ పంపించిదే అయి ఉంటుందని అంటుంది. రేపు నిషిని ఓ కంట కనిపెడదామని....ఆ పార్శిల్‌లో వచ్చింది ఏదైనా వస్తువే అయితే దాన్ని బయటకు తీసుకెళ్లడానికి నిషి కచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తుందని ధాత్రి అంటుంది.అదేంటో మనం కనిపెట్టాలని కేదార్‌తో చెబుతుంది.

Continues below advertisement

   సుధాకర్‌పై దాడి జరగడంతో వైజయంతి ఇంట్లో  సౌభాగ్యలక్ష్మీ వ్రతం చేయిస్తుంటుంది. ఇంట్లో అందరూ ఆ హడావుడిలో ఉంటారు. ఇంతలో నిషికి ఏదో కొరియర్ వస్తుంది. ఏంటి ఆ ఆర్డర్‌ అని జగధాత్రి ఆరా తీయగా...నీకు ఎందుకు చెప్పాలంటూ  కోపంగా మాట్లాడి ఆ పార్శిల్ తీసుకుని మేడపైకి వెళ్లిపోతుంటే...కౌషికి పిలిచి అడుగుతుంది. పూజకు వచ్చిన వారికి రిటర్న్‌ గిప్ట్‌లు ఆర్డర్ చేశానని చెబుతుంది. కుంకుమ భరణిలు తెప్పించానని చెప్పడంతో ఆ వివాదం అంతటితో సద్దుమణుగుతుంది. కానీ ధాత్రి, కేదార్‌కు ఆ పార్శిల్‌పై ‌అనుమానం వస్తుంది. నువ్వు కింద పూజ పనిచూస్తూ ఉండూ...నేను పైకి వెళ్లి ఆ బాక్స్‌ సంగతి ఏంటో తేలుస్తానని కేదార్ అంటాడు. వైజయంతి కుంకుమ భరణిలు చూపించమని అడగ్గా...నిషి బాక్స్‌ ఓపెన్ చేసి వాటిని ఆమెకు చూపిస్తుండగా కేదార్ చూస్తాడు. అతను కూడా వాటిల్లో కుంకమ భరణిలు ఉండటం చూసి వెళ్లిపోతాడు. వైజయంతి కూడా వెళ్లిపోయిన తర్వాత...నిషిక ఆ కుంకుమ భరణిల్లో వజ్రాలు నింపి వాటిపై కుంకమ వేస్తుంది. కిందకు వచ్చి ధాత్రికి అదే విషయం చెబుతాడు. మనమే అనవసరంగా  నిషిని అనుమానిస్తున్నామని అంటాడు. పూజ అయ్యే వరకు  నిషికి సంబంధించిన ఏ వస్తువు బయటకు వెళ్లకుండా మనం చూసుకోవాలని...ప్రతిదీ చెక్‌ చేయాలని ధాత్రి చెబుతుంది.

      ఇంతలో కౌషికి కూతురు కీర్తి ఆడుకుంటూ వచ్చి కుంకుమ భరణిలు కిందపడేయగా...ఆ చిన్నారిని నిషిక కొట్టబోతుంది.ఇంతలో ధాత్రి వచ్చి అడ్డుకుంటుంది. నిషిక కీర్తిని కోప్పడగా...కౌషికి మండిపడుతుంది. నా కూతురుని ఇంకో మాట  అంటే సహించేది లేదని హెచ్చరిస్తుంది. గట్టిగా తిట్టడంతో  అందరూ కీర్తికి సారీ చెప్పమంటారు. దీంతో చేసేది లేక నిషిక కీర్తికి సారీ చెబుతుంది. ఇంకోసారి నా కూతురుపై చెయ్యి ఎత్తితే సహించేది లేదని హెచ్చరిస్తుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత నిషిక కోపంతో రగిలిపోతుంది. నన్నే ఇన్ని మాటలు అన్న కౌషికి  త్వరలోనే నేనేంటో చూపిస్తానని వైజయంతితో చెబుతుంది. వదిన కన్నా ఎక్కువ డబ్బు,ఆస్తి సంపాదించి తనకు ఎదురుగా వచ్చినప్పుడు ఈనిషిక అంటే ఏంటో తెలుస్తుందని అంటుంది.

Continues below advertisement

    కింద పూజారి వ్రతం చేయిస్తుంటాడు. ఇంతలో ధాత్రికి అనుమానం వస్తుంది. కేవలం కుంకుమ భరణిలు కిందపడేస్తే...కీర్తిపై నిషిక అంత కోపం ఎందుకు చేసిందో అర్థం కాదు. ఖచ్చితంగా ఆ కుంకుమ భరణిల్లోనే ఏదో మతలబు ఉందని అనుమానిస్తుంది. దీంతో పూజ జరుగుతుండగా  నిషిక సహా అందరూ కిందే ఉండగా....ధాత్రి మాత్రం మెల్లగా పైకి వెళ్లడాన్ని నిషిక చూస్తుంది. ధాత్రి వెనక కేదార్ కూడా పైకి వెళ్తాడు. మెగుడు పెళ్లాం ఇద్దరూ పైకి వెళ్లడంతో నిషికకు భయం వస్తుంది. ఇంతలో కేదార్ వెళ్లి పూజ జరుగుతుంటే నువ్వు మాత్రం ఎందుకు పైకి వచ్చావని ధాత్రిని అడుగుతాడు.  పూజ వద్ద ఉన్న ముత్తయిదువులను ఎప్పుడైనా  మన వీధిలో గానీ, మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదు. అందుకే వారిని చూస్తే అనుమానం వస్తుందని చెబుతుంది. ఎక్కడో  ఏదో తప్పు జరుగుతుందని...మన ఇంట్లో మన కళ్ల ముందే  మీనన్ తిరుగుతున్నట్లు అనిపిస్తోందని అంటుంది. మన కళ్ల ముందే ఏదో పెద్ద డీల్‌ జరుగుతోందని అంటుంది. పూజ అయిపోయేసరికి ఇళ్లంతా ఒకసారి వెతుకుదామని కేదార్ అనగానే  ధాత్రి సరేనంటుంది. జగధాత్రి తన రూమ్‌లోకి వెళ్లడాన్ని నిషిక చూసి మరింత హడలిపోతుంది. దీనికి ఏదో అనుమానం వచ్చిందని..అందుకే నా రూమ్‌లోకి వెళ్తోందని భయపడుతుంది.