Gemstone: కొంతమంది చిన్న విషయానికే కోపగించుకుంటారు..కొన్నిసార్లు తమను తాము నియంత్రించుకోలేరు. కానీ ఆ తర్వాత కచ్చితంగా దాని గురించి ఆలోచించి చింతిస్తారు. అలా ఎందుకు చేశానా అని బాధపడతాడు. అలాంటి స్థితిలో మానసిక శాంతి చాలా ముఖ్యం. దీనివల్ల వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని స్టోన్స్ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి, వాటిలో ఒకటి ముత్యం, ఇది చంద్రునితో ముడిపడి ఉంది.
ముత్యం - చంద్రుడితో ముడిపడి ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బలమైన స్థానంలో ఉంటే వారు ప్రశాంతంగా, సమతుల్యంగా , సహజంగా ఉంటారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు భావోద్వేగాలు, సున్నితత్వం మానసిక సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. చంద్రుడిని మనఃకారకుడు అనడం వెనుకున్న ఉద్దేశం ఇదే. అయితే.. అదే సమయంలో ఒకరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, కోపం, ఒత్తిడి ,అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి , సమస్యలు పెరుగుతాయి. ముత్యాలను ధరిస్తే, అది భావోద్వేగాలలో స్థిరత్వాన్ని తెస్తుంది.
ముత్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ముత్యం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కోపాన్ని తగ్గిస్తుంది, ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది .. నెమ్మదిగా సున్నితంగా మరియు ప్రశాంతంగా మారుతాము. అదే సమయంలో, మనస్సులో సానుకూల శక్తి పెరుగుతుంది ..ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. నిద్ర శక్తిని కూడా మెరుగుపరుస్తుంది... ఏదైనా నిర్ణయం తీసుకోవడం సులభం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు బాధపడే లేదా కోపంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ రత్నం చాలా ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు.
ముత్యాలను ఎప్పుడు ధరించాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజు చంద్రదేవునికి, ముత్యాల రత్నానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కానీ ముత్యాలను ధరించే ముందు, దానిని శుద్ధి చేయడం అవసరం. సాధారణంగా, దీనిని గంగాజలం, పాలు మిశ్రమంలో శుద్ధి చేస్తారు. విధివిధానాల ప్రకారం పూజించి ధరించాలి.
ముత్యాలను ఏ లోహంలో ధరించాలి?
ముత్యాలను వెండి ఉంగరంలో ధరించడం ఉత్తమం. ఎందుకంటే వెండి మనస్సును శాంతింపజేస్తుంది ..చంద్రుని శక్తిని మరింత బలపరుస్తుంది. వెండిలో పొదిగిన ముత్యాలను ధరించడం వల్ల దాని సానుకూల ప్రభావం త్వరగా కనిపిస్తుంది ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో లేదా తరచుగా మానసిక ఒత్తిడి , చిరాకుగా ఉంటారో వారికి ముత్యం ఉపయోగకరం. అయితే ధరించే నవరత్నాల్లో ప్రతి రత్నం వెనుకా బలమైన శక్తి ఉంటుంది. అనుభవజ్ఞుడైన పండితుడిని సంప్రదించి ఏ రత్నం ధరిస్తే మంచిదో తెలుసుకుని ధరిస్తే అది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది...తప్పుడు రత్నాన్ని, పెట్టుకోకూడదని వేలికి ధరిస్తే దానివల్ల ప్రతికూల ప్రభావం తప్పదు. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఉత్తరాఖండ్ అడవుల్లో భయానక గాలులు! అప్సరసల శాపమా? రహస్య శక్తులా?