Uttarakhand paranormal winds:  ఉత్తరాఖండ్ అడవుల్లో రహస్య గాలల గురించి స్థానికులు, యాత్రికులు, ట్రెక్కర్లు దశాబ్ధాలుగా చెప్పుకునే భయాకన కథనం ఒకటుంది. దీన్ని  “Mystery Winds of Uttarakhand” ,  “Whistling Evil Winds” అని కూడా అంటారు.  ఉత్తరాఖండ్‌లో స్థానిక జానపద కథలు , నమ్మకాలలో తప్పనిసరిగా చర్చించుకునే అంశం... ఈ రహస్యమైన గాలి.

Continues below advertisement

స్థానికుల నమ్మకం ప్రకారం, గాలి  దానితో సంబంధం ఉన్న అసాధారణ సంఘటనల వెనుక ఆంచారి (Aachari) లేదా 'భరడి' (Bharadi) అనే అడవి దేవతలు , దైవిక ఆత్మలు ఉన్నాయి. ఈ రకమైన రహస్య భావనలు ఉత్తరాఖండ్‌లో ప్రధానంగా తెహ్రీ జిల్లాలోని ఖైట్ పర్వత్ (Khait Parvat) ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాయి, దీనిని స్థానికులు అప్సరసల దేశం అని కూడా పిలుస్తారు. 

ఉత్తరాఖండ్ జానపద కథల ప్రకారం, ఖైట్ పర్వతం 9 శిఖరాలపై 9 మంది అప్సరస సోదరీమణులు నివసిస్తున్నారని నమ్ముతారు, వీరిని స్థానికులు ఆంచారి లేదా అడవి దేవత అని పిలుస్తారు. ఖైట్ పర్వతం తొమ్మిది శిఖరాలపై ఈ సోదరీమణులు అదృశ్యంగా నివసిస్తున్నారు.

Continues below advertisement

గర్వాల్, కుమావున్ హిమాలయాల్లోని ..రూప్ కుండ్, నందాదేవి రిజర్వ్, వ్యాలీ ఆప్ ఫ్లవర్స్ చుట్టుపక్కల ఎత్తైన పాస్ లు, బెదిని-బగ్దీ ప్రాంతాలు...ఇక్కడి నుంచి రాత్రి సమయంలో భయానక గాలులు వీస్తాయట. దీనిని స్థానికులు అప్సరసల శాపం, దేవతల ఆగ్రహం అని అంటారు. 

1980 - 90 ల్లో బెదిని బగ్జీ ట్రెక్ లో ఓ బృందం మాయమై..చాలా రోజుల తర్వాత వాళ్ల శవాలు ఎలాంటి గాయాలు లేకుండా దొరికాయి 2000 సంవత్సరంలో ఇద్దరు బ్రిటీష్ ట్రెక్కర్లు రాత్రి పూట విజిల్ శబ్ధాలు, గాలి శబ్ధం విన్నారు..ఆ తర్వాత గాలి తమను లాగినట్టు అనిపించిందని చెప్పారట

స్థానికులు ఈ దైవిక ఆత్మలు సమీప ప్రాంతాలు, గ్రామాలను రక్షిస్తాయని నమ్ముతారు. 

ఉత్తరాఖండ్ నుంచి వీచే ఈ రహస్యమైన గాలిని తరచుగా అప్సరసల ఉనికి లేదా వారి సంచారానికి సంకేతంగా చూస్తారు. స్థానికులు కొన్నిసార్లు గాలిలో శబ్దం, రాత్రిపూట బాలికల నవ్వును అప్సరసలతో ముడిపెడతారు.

రహస్య శక్తుల నుంచి రక్షణ నియమాలు

ఇలాంటి జానపద నమ్మకాలు ఉన్న ప్రదేశాల్లో కొన్ని నియమాలను పాటించడం కూడా అవసరం. నమ్మకాల ప్రకారం ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే, అప్సరసలు వారికి హానికలిగిస్తాయట. అంతేకాకుండా ఆ వ్యక్తుల్ని తమతో పాటూ అప్సరసల ప్రపంచానికి తీసుకెళ్లిపోతారనే ప్రచారం ఉంది ఈ ప్రాంతాల్లో నివసించేవారు మెరిసే,  ప్రకాశవంతమైన దుస్తులు ధరించడం మంచిది కాదని స్థానికులు కూడా చెబుతారు..ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఉత్తరాఖండ్‌లో ఇప్పటికీ వీటిని పాటించే చాలా ప్రాంతాలున్నాయి. ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత ఉండటం లేదా శబ్దం చేయడం నిషేధం. ఎందుకంటే ఆ సమయం ప్రతికూల శక్తి, అప్సరసలకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఖైట్ పర్వతంలో ఉన్న పండ్లు లేదా పువ్వులను ఎవరైనా తమతో పాటు తీసుకువెళితే, అవి వెంటనే వాడిపోతాయని.. చెడిపోతాయని స్థానిక కథలు ప్రచారంలో ఉన్నాయి ఉత్తరాఖండ్  నుంటి వీచే గాలి కేవలం వాతావరణ శాస్త్రం యొక్క సాధారణ సంఘటనలో భాగం కాదు, ప్రకృతి  మానవుల మధ్య ఒక పురాతన ఆధ్యాత్మిక సంబంధానికి చిహ్నం, ఇక్కడ స్థానిక శక్తులు సహజ సంఘటనల ద్వారా తమ ఉనికిని నమోదు చేస్తాయని నమ్మకం 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించి మాత్రమే. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.