Just In





Weekly Horoscope: ఈ వారం ఈ రాశివారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు
Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Astrological prediction from 17th to 23rd October 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం తులా రాశి నుంచి మీన రాశివరకూ...ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
Also Read: ఈ రాశివారిని ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ వారం తులారాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే సక్సెస్ అవుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలుంటాయి. స్తిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచిసమయం. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగిపోతాయి, వ్యాపారం బాగా సాగుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు మధ్యలో ఆపివేయవద్దు.
వృశ్చిక రాశి (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సకాలంలో తీసుకునే నిర్ణయాలవల్ల సక్సెస్ అవుతారు. మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటారు. ఈ వారం అదృష్టం మీ వెంటే ఉంది. ఉద్యోగులకు మంచి సమయం. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం. పారిశ్రామికవర్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
ఈ వారం ఈ రాశివారికి కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్తిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు,విద్యార్థులు అందరూ సక్సెస్ అవుతారు. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి ఆరోగ్యం జాగ్రత్త. మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా నష్టపోతారు.
Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ వారం ఈ రాశివారు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్నపనులు పూర్తిచేస్తారు.నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. మనోబలం ఉంటేనే సక్సెస్ అవుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..అనుభవజ్ఞులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ వారం కుంభరాశివారు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తారు. అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. విద్యార్థులు సక్సెస్ అవుతారు. కళారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం ఇది. ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతలు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం మీనరాశివారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సహనం అవసరం. ధైర్యంగా ముందడుగు వేయండియ. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటే ప్రశాంతత పెరుగుతుంది. అడ్డంకులను అధిగమించి పనులు పూర్తిచేయగలుగుతారు. తొందరపడొద్దు...