ఏప్రిల్ 17 - 23 వారఫలాలు, ఈ వారం ఈ రాశులవారికి ప్రమాదం పొంచిఉంది జాగ్రత్తపడాలి

Weekly Rasi Phalalu ( April 17 to 23) : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Continues below advertisement

Weekly Horoscope ( April 17 సోమవారం నుంచి 23 ఆదివారం వరకూ):  ఈ ఆరు రాశులవారిలో కొందరికి మిశ్రమ ఫలితాలున్నాయి.. ముఖ్యంగా వృశ్చికరాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి 

Continues below advertisement

మేష రాశి 

మేశరాశివారు ఈ వారం మొత్తం పనిలో బిజీగా ఉంటారు. శ్రామిక వర్గానికి ఈ వారం ఒక మోస్తరు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది...టార్గెట్ పూర్తిచేయడానికి అదనపు కృషి అవసరం అవుతుంది. ఈ సమయంలో కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.మీకు తెలియకుండానే చిన్న చిన్న చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది..జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చులు తగ్గించకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. వారం మధ్యలో కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం గురించి మనసు ఆందోళన చెందుతుంది. ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఆహారం, దినచర్యలో జాగ్రత్త వహించండి. మంచి వైవాహిక జీవితం కోసం జీవిత భాగస్వామి భావాలను విస్మరించవద్దు.

వృషభ రాశి 

ఈ వారం ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్య వారం ప్రారంభంలో పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు ఈ వారం గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం. సమర్ధవంతమైన వ్యక్తి సహయంతో మీరు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. కమీషన్ల వ్యాపారం, కాంట్రాక్టులు ఉన్నవారికి ఈ వారం శుభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. చిన్న చిన్న అల్లరి తగాదాలతో వైవాహిక బంధం మరింత అందంగా మారుతుంది. 

Also Read: గురుచండాల యోగం - 6 నెలల పాటూ ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

సింహ రాశి

సింహ రాశివారికి వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణం చాలా శుభప్రదంగా , ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కడి నుంచో రావాల్సిఉన్న డబ్బు..అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. దీర్ఘకాలిన వ్యాధిబారినపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. ఈ సమయంలో ఆహారం ,దినచర్యలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి మరమ్మతులు లేదా సౌకర్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రేమ సంబంధంలో తొందరపడి ఏ అడుగు వేయడం లేదా భావోద్వేగాలకు లోనుకావడం మానుకోండి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో మీ జీవిత భాగస్వామి అండగా ఉంటారు.

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశివారికి ఈ వారం మీ బాధ్యతల నిర్వహణను సకాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. కార్యాలయంలో జూనియర్ సీనియర్ తో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. ఈ కారణంగా కొంత కలతచెందుతారు..అయితే సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్య గురించి మనసు ఆందోళన చెందుతుంది. ఈ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి లేకపోతే గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. భూమి, భవనానికి సంబంధించిన ఏదైనా వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లడం కంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రేమ భాగస్వామితో మంచి అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి వారి భావాలను విస్మరించవద్దు. జీవిత భాగస్వామికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మనసు కాస్త ఆందోళన చెందుతుంది.

Also Read: సంతోషం, సంపద, విజయం - ఈ వారం (ఏప్రిల్ 17 to 23) ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

ఈ వారం కుంభరాశివారు స్నేహితుల సహాయంలో అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వారం ప్రారంభంలో, ఒక మహిళా స్నేహితురాలి సహాయంతో పెద్ద ప్రయోజనకరమైన పథకంలో చేరే అవకాశాన్ని పొందవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తికి ఆశించిన విజయం లభిస్తే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలకు మంచి ఆఫర్లు లభించగా, వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు మీరు చేసిన ప్రయత్నాలను ప్రజలు ప్రశంసిస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Continues below advertisement