Guru Chandaal Yoga: గురుచండాల యోగం - 6 నెలల పాటూ ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం వాడుకలో గురు గ్రహంగా ప్రరిగణించే దేవ గురువు బృహస్పతి రాహువుతో కలిసి ఒకే రాశిలో ఉంటే దాన్ని గురుచండాల యోగం అంటారు.

Continues below advertisement

గురు చండాల యోగం ఏప్రిల్ 23 న ప్రారంభం కాబోతోంది. ద్వాదశ రాశుల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అసలు గురు చండాల యోగం అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

Continues below advertisement

జ్యోతిష్య  శాస్త్రం  ప్రకారం మనం వాడుకలో గురు గ్రహంగా ప్రరిగణించే దేవ గురువు బృహస్పతి రాహువుతో కలిసి ఒకే రాశిలో ఉంటే దాన్ని గురుచండాల యోగం అంటారు. జాతక చక్రంలో లేదా గోచారంలో గురుచండాల దోషాన్ని సృష్టిస్తుంది ఈ స్థితి. రాహువు గురువుతో కలిసి ఏ రాశిలో చేరినా అది గురుచండాల యోగమే. ఒక్కోసారి గురువు శుభగ్రహమైన కేతువుతో కలిసి ఒకే రాశిలో ఉంటే దాన్ని గణేశ యోగం అంటారు.

ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు గరు, రాహు గ్రహాలు రెండూ కలిసి మేషరాశిలో ఉంటాయి. ఏదైనా ఒకే రాశిలో గురువు రాహువుతో లేదా కేతువుతో లేదా శనితో కలిసి ఉంటే అప్పుడు గురుచండాల యోగం నడుస్తున్నట్టు జ్యోతిష్య  శాస్త్రం  చెబుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23 న గురు గ్రహం మీనం నుంచి మేషంలోకి ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి అక్టోబర్ 24 వరకు మేషరాశిలోనే కొనసాగుతుంది. ఆతర్వాత తిరిగి మీన రాశిలోకి వస్తుంది. ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 24 వరకు రాహు, గురు గ్రహాలు కలిసి మేషరాశిలో ఉంటాయి.

Also Read: ఏప్రిల్ 16 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారి జీవితంలో ఆనందం పెరుగుతుంది, ఈ రాశివారికి ఆందోళనలు తొలగిపోతాయి

సాధారణంగా రాహు, గురు గ్రహాల కలయిక ప్రతికూల ప్రభావాలనే కలిగి ఉంటుంది. పర్సనల్ చార్ట్ లో బృహస్పతి స్థానం, బలంపై ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎంత ప్రభావం ఉంటుంది అనే విషయం ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు. గురు చండాల యోగం ప్రతికూల ప్రభావాలు రకరకాలుగా ఉంటుంది. దీని ప్రభావంలో ఉన్నవారికి చదువు, వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి. నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది. కుటుంబంలో కూడా కలహాలు రావచ్చు. తండ్రీ కొడుకుల తీవ్రమైన విబేధాలకు కారణం కావచ్చు.

గురువు బలంగా లేకపోతే ఆస్తమా, కామెర్లు, ట్యూమర్లు, మలబద్దకం, కాలేక సమస్యలు వంటి అనారోగ్యాలు కలుగవచ్చు. ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు. మొండిగా వ్యవహరిస్తారు. కొన్ని సార్లు టీమ్ లో పనిచెయ్యలేరు. వారసత్వ ఆస్తి పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. అకస్మాత్తుగా అనైతిక కార్యకలాపాలకు ఆకర్శితులవుతారు.

పన్నెండు రాశుల్లో ఎవరికి ఎలా ఉందో చూద్దాం

మేషరాశి

చికాకులు ఎక్కువవుతాయి. పనుల్లో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు

వృషభరాశి

ఖర్చులు ఎక్కువవుతాయి, ఆరోగ్యం జాగ్రత్త

మిథున రాశి

వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, చీకాకు

కర్కాటక రాశి

రాజకీయ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు

సింహరాశి

వీరికి అన్ని విషయాల్లో ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి.

కన్యారాశి

ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబ కలహాలు గోచరిస్తున్నాయి

తులారాశి

తులరాశి వారికి అన్ని విషయల్లోనూ మధ్యస్థంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

శారీరక శ్రమ, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది.

Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!

ధనురాశి

మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు

మకర రాశి

ఆరోగ్యం జాగ్రత్త, మిగతా అంశాల్లో ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి.

కుంభరాశి

ధనవ్యయం, కుటుంబ సమస్యలు రావచ్చు జాగ్రత్త

మీనరాశి

గొడవలకు దూరంగా ఉండాలని సూచన, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి

అన్ని రాశుల వారికి పరిహారం

విష్ణువు ఆరాధన చేసుకోవాలి, గురు గ్రహ స్త్రోత్ర పారాయణ చేసుకోవాలి. గణపతి ఆరాధన చేసుకోవాలి. పెద్దలు గురువుల పట్ల గౌరవంతో మర్యాదగా నడచుకోవాలి. పెద్దల మనసు నొప్పించకూడదు. పశు పక్ష్యాదులకు ఆహారం అందించాలి.

Continues below advertisement
Sponsored Links by Taboola