మార్చి 27 గురువారం రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మి పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. వివాహం గురించి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. కొందరు మిమ్మల్ని గందరగోళానికి గురేచేసే ప్రయత్నం చేస్తారు. ఎవరి మాటలను అతిగా విశ్వశించవద్దు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభాన్నిస్తాయి


వృషభ రాశి


మీ పాత అనుభవాలు మీకు ఉపయోగపడతాయి. మీ హక్కులు నెరవేర్చుకుంటారు. మీ ఉదార ప్రవర్తన ప్రశంసలు అందుకుంటుంది. మీ కారణంగా జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. 


మిథున రాశి


ఈ  రోజు మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక డబ్బు ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయంలో మీతీరు ప్రశంలు పొందుతుంది. కొందరు మిమ్మల్ని తప్పుడు దిశగా నడిపించే అవకాశం ఉంది. స్నేహితుల సలహాలు విస్మరించవద్దు.


కర్కాటక రాశి


ఈ రోజు మీ తీరు నచ్చక కొందరు మీకు దూరమైపోతారు. కుటుబంలో వివాద సూచనలున్నాయి. కఠినమైన పదాలు వినియోగించవద్దు. నూతన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 


సింహ రాశి


మీ రహస్యాలు ఎవరికీ చెప్పొద్దు. వృద్ధులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది.  సహోద్యోగులతో సరైన వైఖరిని కలిగి ఉండండి. మీరు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. 


కన్యా రాశి


ఈ రోజు కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. విదేశాలలో వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ మాటతీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఆకస్మికంగా కొన్ని పనులు చేపట్టాల్సి వచ్చినా వాటిని పూర్తిచేస్తారు. 
 
తులా రాశి


ఈ రోజు మీకు కొత్తగా నేర్చుకనే అవకాశం ఉంది. వ్యాపార వృద్ధి కోసం మీరు రుణం తీసుకోవలసి ఉంటుంది. మునుపటితో పోలిస్తే కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పురోగతితో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. మీరు శత్రువులపై గెలుస్తారు. 


వృశ్చిక రాశి


 రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. అనుకున్న పనులు పూర్తిచేలేరు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. సాంకేతిక విద్యలో ఉండేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. అధ్యయనాలపై ఆసక్తి ఉంటుంది. 
 
ధనస్సు రాశి


ఈ రోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరు చేయాలి అనుకున్న పనిని పూర్తిచేయలేరు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. అనవసర విషయాల గురించి గందరగోళానికి గురవుతారు. మీ కృషికి అర్థవంతమైన ఫలితాలు పొందలేరు. 


మకర రాశి


ఈ రోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు.  వ్యాపార విస్తరణ కోసం నిధులు సిద్ధం చేసే పనిలో ఉంటారు.  నూతన ఉద్యోగం సాధిస్తారు.మీపై మీకున్న విశ్వాసం పెరుగుతుంది 


కుంభ రాశి
 
ఈ రోజు మీ సన్నిహితుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. మద్యం వ్యాపారులు కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు.


మీన రాశి


ఈ రోజు వైవాహిక జీవితంలో సమస్యలు అధిగమిస్తారు. ఉన్నత అధ్యయనాలపై ఆసక్తి పొందుతారు. మీ పని శైలి చాలా బాగుంటుంది. మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి 


ఉగాది 2025 - శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మేషం నుంచి మీనం వరకూ  మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 


గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.