Sun Transit: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  గ్రహాల రాజు సూర్య భగవానుడు నెల రోజులకు ఓసారి రాశి మారుతాడు. సూర్యుడు రాశి మారిన సందర్భాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. అలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశంచినప్పుడు మకర సంక్రాంతి, కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి జరుపుకుంటాం. మిగిలిన సంక్రాంతిలకు పండుగల పరంగా పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆదిత్యుడు రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ఆ నెల రోజులు 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ఆయా రాశినుంచి సూర్యుడుసంచరించే స్థానాన్ని బట్టి ఆప్రభావం ప్రతికూలంగా, అనుకూలంగా, మిశ్రమంగా ఉంటుంది. అలా సూర్య భగవానుడు ఏడాదికి 12 పరివర్తనాలు జరుపుకుంటాడు. అవే 12 సంక్రాంతిలు. ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న సూర్యుడు..మే 14 రాత్రి తెల్లవారితే మే 15 గురువారం రోజు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.సూర్యుడి రాశి పరివర్తనం కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా వృషభంలో ఆదిత్యుడి సంచారం మూడు రాశులవారికి అదృష్టం తీసుకొస్తుంది.  

వృషభ రాశి

మీ రాశిలోనే సూర్యుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా విశేష ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఉండేవారికి ఈ సమయం బాగా కలిసొస్తుంది. మీ ప్రణాళికల్లో పురోగతి వైపు ఉంటుంది. కార్యాలయంలో ధైర్యంగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఆర్థికంగా అడుగు ముందుకుపడుతుంది. వ్యాపారం పెంచుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు...వాటిని అద్భుతంగా అమలు చేస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

కన్యా రాశి

వృషభ రాశిలో సూర్యుడి సంచారం అంటే..మీ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో పరివర్తనం జరుగుతోంది. ఈ సమయంలో మీ సంపద పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. మిమ్మల్ని మీరు నిరూపించే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభం పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగం కోసం వెతుక్కునేవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

మకర రాశి

వృషభ రాశిలో సూర్యుడి రాశి పరివర్తనం అంటే మీ రాశి నుంచి ఐదో ఇంట ఉన్నాడు సూర్య భగవానుడు. ఈ సమయంలో మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు కానీ చివరకు విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీరు పిల్లల నుంచి ఆనందం పొందుతారు. ఓ శుభవార్త వింటారు.

మే 15 నుంచి వృషభ రాశిలో సంచరించే సూర్యుడు...జూన్ 14న మిథున రాశిలో అడుగుపెడతాడు..

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

రామాయణ, మహాభారత కాలంలో ఒకే సమయంలో యుద్ధవిరమణ - ఇప్పుడు భారత్ పాక్ మధ్య కూడా అదే సమయంలో జరిగిందా? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 పాండవుల దూతగా కౌరవుల సభలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడు యుద్ధం విరమించాలని కోరాడు. ఆ సమయంలో ఏం చెప్పాడో వివరిస్తూ.. భారత్ - పాక్ యుద్ధవిరామ సమయంలో DGMO బ్రీఫింగ్ ప్రారంభించారు..ఆ కవిత ఇదే