Astrology In Telugu: హిందూ సాంప్రదాయంలో రాశిఫలాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశులతోనే మనుషుల భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను నిర్ణయిస్తారు పండితులు. అయితే పన్నెండు రాశులలో అన్నింటి కన్నా బలమైన రాశి ఏదో ఆ రాశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే వాళ్లు కొట్లలో ఉంటారు. సనాతన హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్యం ఒక కళగా ప్రజ్వరిల్లుతుంది. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ద్వాదశ రాశుల సమయానుకూలతను బట్టి ఒక మనిషి జాతకాలను గణిస్తారు పండితులు. అయితే పన్నెండు రాశులలో కూడా ఒక్క రాశి చాలా శక్తివంతమైందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయో కూడా జ్యోతిష్యశాస్త్రంలో సవివరంగా ఉందంటున్నారు పండితులు. అయితే ఆ రాశిలో పుట్టిన వ్యక్తులకు మొహమాటం కొంచెం ఎక్కువగా ఉంటుందట. వారు అందరిలో త్వరగా కలిసిపోరట.. తమ చుట్టు ఉన్నవారిని అంచనా వేసి వారిపై ఒక నిర్ణయానికి వచ్చాకే వారితో మాటా మంతి కలుపుతారట. ఎవ్వరినీ కూడా అంత ఈజీగా నమ్మరని తమ నీడను తామే అనుమానించేంత స్వభావం ఈ రాశి వ్యక్తులకు ఉంటుందట.
అయితే ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ప్రాణం పోయిన కూడా వారిని వదిలిపెట్టరట. బద్దకంగా ఉండటమంటే వీరికి అసలు నచ్చదట. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేదుకు ఇష్టపడతారట. అయితే చేస్తున్న పని ఏదైనా మొక్కుబడిగా చేయరట.. అంకితభావంతో ఏకాగ్రతతో చేస్తారట. అందుకే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ వృత్తిపరంగా సక్సెస్ బాటలో నడుస్తారట. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఆ ఫీల్డ్ లో టాప్ పొజిషన్‌లో ఉంటారట. ఈ రాశి వారికి పోరాటతత్వం ఎక్కువగానే ఉంటుందట.. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా ఓటమిని అంగీకరించని మనస్తత్వం ఈ రాశి వారిది అంటున్నారు జ్యోతిష్య పండితులు.
జీవితంలో విజయం సాధించేవరకు ఎంత కష్టమున్నా వదిలిపెట్టరట.. అనుకున్నది సాధించి ధీరుడివలే నిలబడతారట. నమ్మి వచ్చినవారికి ఏటువంటి సమయంలోనైనా సాయం చేయడానికి సిద్దంగా ఉంటారట. అయితే ఈ రాశి వారితో స్నేహం చేయడం అంత సులువు కాదట. పైగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయట. ఏ పని చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడని వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారు అంటుంన్నారు పండితులు. ఇంతకీ ఈ రాశి ఏంటో తెలుసుకోవాలని ఉది కదా.
ALSO READ: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!
ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి. అవును మీరు చదువుతున్నది నిజమే.. పన్నెండు రాశుల్లో కెల్లా అతి బలమైన రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు స్వభావసిద్దంగా నాయకులుగా ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా మనోధైర్యంతో ఎదుర్కొనే శక్తి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఉంటుందట. ఎటువంటి బాధ్యతలనైనా స్వీకరించి సమస్యలను పరిష్కరించటంలో ముందుటారట. నిర్ణయాలు తీసుకోవడంలో ఈ రాశి వ్యక్తులు స్పీడుంటారట. ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలోనూ వృశ్చిక రాశి వ్యక్తులు టాప్‌లో ఉంటారట. ఇతర రాశులతో పోలిస్తే ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయి కాబట్టే ఈ రాశి వ్యక్తులను బలమైన వారిగా ఈ రాశిని బలమైన రాశిగా అభివర్ణిస్తారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.