Daily Horoscope for 23 August 2024
మేష రాశి
ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విదేశాలకు ప్రయాణించేవారు ముఖ్యమైన పత్రాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త
వృషభ రాశి
ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలు క్రమశిక్షణగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది
మిథున రాశి
నూతన వ్యాపారం ప్రారంభించేందుకు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. ఖర్చుల విషయంలో మరోసారి ఆలోచించండి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో చిక్కులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.
Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!
కర్కాటక రాశి
అనుకున్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పిల్లల్లో మనోధైర్యం పెంచేందుకు ప్రయత్నించండి..కుటుంబానికి సమయం కేటాయించాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బావుంటుంది
సింహ రాశి
ఆర్థిక సంబంధిత విషయాల్లో కొన్ని తప్పులు చేస్తారు. స్నేహితులను అవమానపర్చొద్దు. కార్యాలయంలో ఆకస్మిక పని ఒత్తిడి ఉంటుంది. నిర్మాణానికి సంబంధించి వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. కెరీర్ పరంగా వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. కార్యాలయంలో ఆకస్మిక పని ఒత్తిడి ఉండవచ్చు.
కన్యా రాశి
ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ రోజు మంచి రోజు. వృత్తి, వ్యాపారాలలో శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అవివాహితులకు వివాహం సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!
తులా రాశి
మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకోండి. మీ మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు. ఈ రోజు మీకు తెలియకుండా కొందరికి మీరు శత్రువులుగా మారుతారు. ఉద్యోగులు ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఎవరికీ ఎక్కువగా నమ్మొద్దు. మీ కోపం మీ వ్యక్తిత్వాన్ని తగ్గించనీయకుండా చూసుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పెండింగ్ లో ఉన్నవి ముందుకు కదులుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కెరీర్ కి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. ఉద్యోగులు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాహేతర సంబంధాలవైపు ఆకర్షితులు అయ్యే అవకాసం ఉంది. కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కుటుంబ సభ్యుల కారణంగా సంతోషంగా ఉంటారు. ఓ సమస్య పరిష్కారం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో లాభాలొస్తాయి
Also Read: మన దేశంలో ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాలు..ప్రతి ఆలయం ప్రత్యేకమే!
కుంభ రాశి
కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
మీన రాశి
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేవారికి బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల విషయంలో కొంత సున్నితంగా వ్యవహరించండి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.