Shukra Gochar 2023:  ఆనందానికి, విలాసానికి సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తాడు శుక్రుడు. మే 30 రాత్రి 7:39 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు జూలై 5 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)


శుక్రుడి సంచారం సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ఆకస్మిక ఖర్చులు, వీటి వలన మానసిక ఒత్తిడి. వ్యాపారం చేసే వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది,  ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం కారణంగా తులారాశి వారు పని రంగంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉద్యోగం చేసే చోట కొన్ని కుట్రలకు బలి కావాల్సి ఉంటుంది.  కాబట్టి అప్రమత్తం గా  ఉండండి. అలాంటి వాటికి దూరంగా ఉండండి  లేకపోతే సహోద్యోగులతో మీ సంబంధాలు క్షీణించవచ్చు. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, వ్యాపార  నిర్ణయాలను వాయిదా వేయండి .


ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


ధనుస్సు రాశి వారికి శుక్ర సంచారం అంత అనుకూలంగా ఉండదు. మీరు తెలియని ఖర్చు చేసే అలవాటు మానుకోవాలి, లేకపోతే మీ సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో,  అనైతిక పనులకు దూరంగా ఉండాలి, లేకపోతే రాబోయే కాలంలో మీరు పరువు ప్రతిష్టలు కోల్పోవల్సి ఉంటుంది . కుటుంబంలో మీకు ఇష్టమైనవారితో తగాదాలు ఉండవచ్చు. కర్కాటకంలో శుక్రుడి సంచారం మీ జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది. ఈ సమయంలో ఎవరికీ రుణాలు ఇవ్వకండి.


కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


శుక్ర  సంచారం ప్రభావం వల్ల మీ ప్రత్యర్థులు కొందరు  మీ పై విజయం సాధిస్తారు, దీని వల్ల మీ సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆఫీసులో మీ సహోద్యోగులు కొందరు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. ఆరోగ్యం  అనుకూలంగా ఉండదు. ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి వివాదాలు చుట్టు ముడతాయి , కాబట్టి ఈ సమయంలో  అనవసర  చర్చలకు, వివాదాలకు  దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.


సాధారణంగా శుక్రుడు.. జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆకర్షణ, అందం, యవ్వనం, ప్రేమ సంబంధం, కోరికలు, ప్రేమ నుంచి సంతృప్తిని సూచిస్తుంది. ఇది సృజనాత్మకత, కళలు, సంగీతం, కవిత్వం, డిజైనింగ్, వినోదం, ప్రదర్శనలు, గ్లామర్, ఫ్యాషన్, నగలు, విలువైన రాళ్లు, అలంకరణ, విలాసవంతమైన ప్రయాణం, విలాసవంతమైన ఆహారం, లగ్జరీ వాహనాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.