దంతాలు మనిషి ముఖానికి అందాన్ని ఇస్తాయి. దంతాల ఆకృతి కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందట. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల ముఖాల్లో కొన్ని పోలికలు కలుస్తాయేమో కానీ అచ్చుగుద్దినట్టు ఉండవు. ఐడెంటికల్ కవలలు అయితే తప్ప. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తుల అవయవాలు, ఆకారాలను విశ్లేషించి చూసి వ్యక్తుల వ్యక్తిత్వాలను అంచనా వెయ్యడం సాధ్యపడుతుంది.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!
- సాముద్రికా శాస్త్రాన్ని అనుసరించి తెల్లగా అందమైన దంతాలున్న వారు అదృష్టవంతులు. ఈ వ్యక్తుల స్వభావం స్నేహశీలమైంది, ఉల్లాసంగా ఉంటుంది. అందరితోనూ సామరస్యంగా జీవిస్తారు. ఇదే వారిని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలబెడుతుంది. వీరిది పోరాట పటిమ కలిగిన వారిగా చెప్పవచ్చు.
- చిగుళ్లు మందంగా బలంగా కనిపించే వ్యక్తి కాస్త అహంకారంతో ఉండే అవకాశం ఉంటుంది.
- గులాబిరంగు చిగుళ్లు కలిగిన వ్యక్తి మర్యాద కలిగిన వ్యక్తి. వీరికి ఆయుష్షు కూడా ఎక్కువ.
- కాస్త పసుపు పచ్చని షేడ్ లో దంతాలు ఉండేవారు చాలా నమ్మకమైన వ్యక్తులు. వీరిని సులభంగా నమ్మవచ్చు. స్నేహపూరిత మనస్తత్వం కలిగిన వారు.
- వంకర టింకరగా, ఎగుడు, దిగుడు దంతాలు ఉన్నవారు జీవితంలో కొన్ని అవకాశాలను కోల్పోతారని చెప్పేందుకు నిదర్శనం.
- సాముద్రిక శాస్త్రం ప్రకారం దంతాలు సమంగా పైకి లేచినట్టు ఉండి సరళ రేఖలో మృదువుగా అమరినట్టు ఉన్న వ్యక్తికి జీవితంలో డబ్బుకు లోటుండదు. లక్ష్మీ దేవి ఆశిస్సులు సదా వీరి మీద ఉంటాయి.
- దంతాల మధ్య అంతరం ఉన్న వ్యక్తులు తెలివైన వారై ఉంటారు. ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పని చేయించుకోవడంలో నైపుణ్యం కలిగిన వారు. వీరు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గని మనస్తతత్వం కలిగిన వారు. ప్రతి సందర్భంలో ఏ విధంగా వారు సంతోషంగా ఉండాలనేది మాత్రమే వారు చూసుకుంటారు. వీరి వ్యక్తిత్వ ప్రభావం వీరితో ఉండేవారి మీద తప్పకుండా ఉంటుంది. ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. తినడం, తాగడం ఎల్లప్పుడూ పార్టీ మూడ్ లో ఉంటుంటారు. కేరీర్ లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు వారి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అందువల్ల వీరి వృత్తి జీవితం చాలా విజయవంతంగా ఉంటుంది.
- పొడవైన దంతాలు కలిగిన వారు అనుభవజ్ఞులు, చాలా పరిణతితో ఆలోచిస్తారు. చాలా ధైర్యవంతులు, దేనికి వెరవని వ్యక్తిత్వం వీరిది. ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉంటారు. వారి పని చేసే శైలి చాలా భిన్నంగా ఉంటుంది.
Also read : కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.