2025 జూన్ 1 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 1st 2025
మేష రాశి
ఈ రోజు మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. జీవిత భాగస్వామిని ఏ విషయంలోనూ తప్పుపట్టవద్దు. ఆదాయం బావుంటుంది అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.
వృషభ రాశి
ఈ రోజు పాత బంధువులతో మాట్లాడుతారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా స్వీయ గౌరవాన్ని పొందుతారు.
మిథున రాశి
మీరు అనవసర చర్చలు నివారిస్తే వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ రహస్య విషయాలను ఎవరితోనైనా పంచుకోవద్దు. కుటుంబ సభ్యుల అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతికూల వార్తలు వినాల్సి వస్తుంది. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి
కర్కాటక రాశి
ఈ రోజు అన్ని పనులు పూర్తవుతాయి. మీరు వ్యాపారంలో పాత అనుభవాల నుంచి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆనందిస్తారు. జీవిత భాగస్వామి వైపు మనస్సులో అహంకారం యొక్క భావం తలెత్తుతుంది. ఏవైనా ముఖ్యమైన పనిని నివారించడం మంచిది.
సింహ రాశి
పరిచయస్తులతో మీ సంబంధాన్ని బాగా ఉంచాలి. వ్యర్థ ప్రేమ వ్యవహారాల కారణంగా మీ మనస్సు బాధపడవచ్చు. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొన్ని తప్పుడు విషయాలను వ్యాప్తి చేస్తారు. ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి
కన్యా రాశి
ఈ రోజు రాజకీయాలతో సంబంధం ఉన్న వారు పెద్ద ప్రయోజనం పొందుతారు. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. వ్యాారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ప్రేమిలో ఉన్నవారు పెళ్లి దిశగా ఆళోచిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉండబోతోంది.
తులా రాశి
ఈ రోజు చాలా అదృష్టవంతులు అవుతారు. ఇంటి సభ్యుల సుఖాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మీకు మీరు చాలా శక్తివంతులుగా భావిస్తారు. స్నేహితులతో వినోదాన్ని ఆనందిస్తారు. కొత్త భవనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు
వృశ్చిక రాశి
ఈ రోజు మతపరమైన పనులలో మీరు మీ మనస్సును లగ్నం చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులు మీపై చాలా నమ్మకం పెట్టుకుంటారు. జీవిత భాగస్వామితో మనసులో మాట పంచుకుంటే మంచిది. ఆలోచనల్లో సున్నితత్వం అవసరం. పరుషంగా వ్యవహరించవద్దు
ధనస్సు రాశి
ఈ రోజు మీ దినచర్య అసమతుల్యతతో ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ పనులు అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అప్పులు చేయవద్దు, ఇవ్వొద్దు. తెలియని వ్యక్తుల కారణంగా సమస్యలు ఎదురవుతాయి
మకర రాశి
ఈ రోజు మీ వల్ల కొందరు లాభపడతారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ లో ప్రయోజకరంగా ఉంటాయి. వివాదాలు పరిష్కరించుకోండి. పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది
కుంభ రాశి ఈ రోజు మీరు మీ కెరీర్ పై అసంతృప్తిగా ఉంటారు. రోజంతా ఇంట్లోనే ఉండడం మంచిది. యాంటీ -సోషల్ ఎలిమెంట్స్‌తో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సమస్యల నుంచి కొంత ఉపశనం పొందుతారు
మీన రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు ఈ రోజు కలిసొస్తుంది. ప్రత్యర్థులు కూడా మిత్రులవుతారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.