మే 19 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి.ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ప్రేమ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది.  భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించండి. పనిప్రదేశంలో మీకు మద్దతు పెరుగుతుంది. 

వృషభ రాశి

ఈ రోజు మీరు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. 

మిథున రాశి

ఈ రోజు మీకు శుభ ఫలితాలున్నాయి. పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహిస్తారు..మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఓ పెద్ద వ్యక్తి సహకారంతో మీ పని  పూర్తవుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ జీవితంలో ఏదో ఒక ఒత్తిడి ఉండవచ్చు. 

కర్కాటక రాశి

ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ప్రభుత్వ అధికారి సహాయంతో, మీరు ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ నిపుణుల ప్రాజెక్టుల నుంచి మంచి ఫలితాలను పొందుతాయి. మీ వ్యాపారం ముందుకు సాగుతారు. కొత్త ఆర్డర్‌లు పొందుతారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది.  పాత వాహనాన్ని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం గురించి ఆలోచించవచ్చు. 

సింహ రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలతాలున్నాయి. కొన్ని పనులు చిక్కుకుపోతారు. ప్రణాళిక ప్రకారం వేసే అడుగులు విజయవంతం అవుతాయి. వ్యాపారానికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. విదేశాల్లో నివసించే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.  జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు  ప్రేమ జీవితంలో సమస్య కూడా పెరుగుతుంది. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి

కన్యా రాశి

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది.  ముఖ్యమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారులు లాభపడతారు.  పెద్ద ఆర్డర్   పొందుతారు. ప్రేమ జీవితంలో ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో ఏదైనా విషయం గురించి వివాద సూచనలున్నాయి కానీ అంతలోనే సర్దుకుంటాయి. మళ్లీ ఒకర్నొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు

తులా రాశి

ఈ రోజు తులా రాశివారికి  అనుకూలంగా ఉంటుంది.  మీరున్న రంగంలోని కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు.  వ్యాపారంలో మంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వివాద సూచనలున్నాయి..శాంతియుత  పరిస్థితిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ప్రేమ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. కుటుంబ కారణాలు గృహ జీవితంలో కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఆందోళనలు పెరుగుతాయి

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు అనుకూలమైన సమయం. పని ప్రదేశంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించండి. ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి ఉంటుంది.  గృహ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి ఈ రోజు మంచిది.  ప్రయాణాన్ని  వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో ఎలాంటి తగాదాలు పెట్టుకోవద్దు.

ధనస్సు రాశి

ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. ప్రేమ జీవితాన్ని అందంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామికి కారణంగా సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీ పదునైన తెలివి కారణంగా, మీరు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఆహారంపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది

మకర రాశి

ఈ రోజు మకర రాశివారు కోపం తగ్గించుకోవాలి. ఏదో విషయంపై  మనస్సులో  గందరగోళం ఉంటుంది.  దాన్ని పరిష్కరించడానికి మీరు అతిగా ఆలోచించవద్దు. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది.  వైవాహిక జీవితం బావుంటుంది. ఖర్చులపై నియంత్రణ ఉంచండి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభ రాశి

ఈ రోజు అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. తగినంత నిద్రపోయేందుకు ప్రయత్నించండి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంల మీ  ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. ఉద్యోగులు శుభ ఫలితాలు పొందుతారు. గృహ జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి

మీన రాశి

ఈ రోజు కొన్ని చికాకుల నుంచి బయటపడతారు.  మీపై మీకు అద్భుతమైన విశ్వాసం ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు కానీ సహోద్యోగులతో చర్చలుంటాయి. భవిష్యత్తు కోసం కొత్త పథకంలో పెట్టుబడి పెడతారు. జీవిత భాగస్వామితో అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.  

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.