మే 14 రాశిఫలాలు

మేష రాశి (Aries) - 2025 మే 14

ఈ రోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజుగా ఉంటుంది. గృహ జీవితంలో భాగస్వామితో ఏదైనా విషయంపై గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ మాటపై మీరు నియంత్రణను కొనసాగించండి లేకపోతే సమస్యలు వస్తాయి. విద్యార్థులకు చదువుపై దృష్టి సారించాలి.  స్నేహితుడి ఆరోగ్యం గురించి  ఆందోళన చెందుతారు. ఏదైనా పనిలో నష్టపోయే అవకాశం ఉంది.. న్యాయ వ్యవహారంలో ఆస్తి కలిసొస్తుంది.

వృషభ రాశి (Taurus) - 2025 మే 14

ఈ రోజంతా బిజీగా ఉంటారు. మీ పనులను రేపటికి వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు..ఇది మీకు సమస్యలు కలిగిస్తుంది. ప్రేమ జీవితం గడుపుతున్న వారు ఈ రోజు సమన్వయంతో ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారు పార్ట్ టైమ్ పని చేయాలని ప్లాన్ చేస్తే అది సులభంగా చేయవచ్చు. మీ పనుల గురించి కొంత అసౌకర్యంగా ఉంటారు. మిథున రాశి (Gemini) - 2025 మే 14

ఈ రోజు మీ జ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబ విషయాలను కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. ఇంట్లో గొడవల వల్ల మీకు ఒత్తిడి ఉంటుంది. అన్నదమ్ములకు శారీరక ఇబ్బందులు ఎదురవడం వల్ల ఆందోళన చెందుతారు. ఏదో ఒక విషయం గురించి మీకు గందరగోళం ఉంటుంది. కెరీర్ పరంగా చాలాకాలంగా ఆగిపోయిన పనులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ వ్యాపార ప్రణాళికల గురించి అనుభవజ్ఞులతో చర్చిస్తారు. 

కర్కాటక రాశి (Cancer) - 2025 మే 14

ఈ రోజు ఏ పనినైనా తొందరపడి చేయొద్దు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ధార్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఎవరినీ అడిగి వాహనం నడపకండి.  మీ పనులను పూర్తి చేయడంలో మీ సోదరుల సహాయం తీసుకోవచ్చు. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఇప్పటికే మీరు  షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి ఉంటే అందులో నష్టం వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి (Leo) - 2025 మే 14

ఈ రోజు ఆర్థిక విషయాలు కలిసొస్తాయి.   బంధువు నుంచి శుభవార్త వినవచ్చు. వైవాహిక జీవితంలో చిన్నసమస్యలు ఉంటాయి.. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాలను బయటకు చెప్పొద్దు. వ్యాపారంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది.

కన్యా రాశి (Virgo) - 2025 మే 14

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది.  చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్య ముగిసిపోతుంది.  పాత స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలుస్తారు. ఓశుభవార్త వింటారు. విద్యార్థులకు చదువు గురించి ఆందోళన ఉంటే అది తొలగిపోతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీ పనుల గురించి జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి (Libra) - 2025 మే 14

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది.  నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. సంతానం వైపునుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్న వారు దానిలో మార్పులు చేయాలని ప్లాన్ చేస్తారు. మీరు పని ప్రదేశంలో జట్టు పని ద్వారా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio) - 2025 మే 14

ఈ రోజు వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మీరు శుభకార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.ఆస్తిలో పెట్టుబడి పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే డబ్బులు తప్పుడు పనుల్లో ఇరుక్కుపోతాయి. మీ కుటుంబంలోని పెద్దల మాటలకు విలువ ఇవ్వాలి. గొడవలు జరిగే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి (Sagittarius) - 2025 మే 14

ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యానని నిర్లక్ష్యం చేస్తే మీ సమస్యలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల మీ విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సమస్యలను కలిసి కూర్చుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. 

మకర రాశి (Capricorn) - 2025 మే 14

ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. మీ పనులతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వాలి. మీ మాటలు, ప్రవర్తనపై నియంత్రణ ఉంచుకోవాలి. ఏదైనా పనిని ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలి. పని ప్రదేశంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల మీకు కొంత ఆందోళన ఉంటుంది. కుంభ రాశి (Aquarius) - 2025 మే 14

ఈ రోజు ఖర్చుతో కూడుకున్న రోజు అవుతుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. మీ తప్పు కుటుంబ సభ్యుల ముందు బయటపడవచ్చు. ఉద్యోగులకు పనిభారం అధికంగా ఉంటుంది. మీ పనులపై పూర్తి దృష్టి పెట్టాలి. అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాను పాటించడం మంచిది.

మీన రాశి (Pisces) - 2025 మే 14

ఈ రోజు మీనరాశివారికి జీవిత భాగస్వామితో ఏదైనా విషయంపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. మీరు ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, అది సులభంగా లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి మంచిగా ఉంటుంది.  కానీ కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మీ తెలివితేటలతో వారిపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.