ఏప్రిల్ 14 రాశిఫలం

 మేష రాశి

ఈ రోజు ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు వ్యాపార ఒప్పందం కోసం మరింత కష్టపడాలి. మీ తీరుకి ఆకర్షితులవుతారు. కుటుంబ పెద్దలతో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. 

వృషభ రాశి

ఈ రోజు మీరు పనిచేసే ప్రదేశంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారం పెంచడానికి మీరు అప్పులు తీసుకుంటారు. ఆధ్యాత్మికతపై  ఆసక్తి పెరుగుతుంది. తల్లి వైపు నుంచి శుభవార్త పొందుతారు. మీరు ఉద్యోగంలో పెద్ద అవకాశం పొందుతారు. మిథున రాశి

ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామికి గౌరవం ఉంటుంది. ఆనందం కోసం ఖర్చులు చేస్తారు. ప్రేమ వివాహం కోసం కుటుంబ ఆమోదం పొందవచ్చు. పిల్లల ప్రతిభను పెంచడానికి ప్రయత్నిస్తారు. కర్కాటక రాశి 

ఈ రోజు వ్యాపార ఒప్పందాల నుంచి ప్రయోజనం పొందుతారు.. కానీ ఆ డబ్బు వెంటనే ఖర్చు చేసేస్తారు. మీ గౌరవం తగ్గే అవకాశం ఉంది. అనవసర ప్రసంగాలను దూరంగా ఉండడం మంచిది.  

సింహ రాశి

ఈ రోజు వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యం బావుంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. వినోదాత్మక కార్యకలాపాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి.

కన్యా రాశి

ఈ రోజు డబ్బు అధికంగా ఖర్చవుతుంది.  ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు మంచి రోజు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది . మీ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి. అధికారుల అంచనాలకు అనుగుణంగా మీరుంటారు. సౌకర్యాల పెరుగుదల ఉంటుంది.

తులా రాశి

ఈ రోజు ఖర్చు పెరుగుతుంది. మీ మనస్సు మేధో రచనల్లో నిమగ్నమై ఉంటుంది. ఆగిపోయిన పనులు సమయానికి పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల గురించి భావోద్వేగంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  బాధ్యతలు నెరవేర్చడంలో అవాంతరాలు ఉంటాయి.  

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. పాత వివాదం మళ్లీ బయటపడవచ్చు. కుటుంబ సభ్యుల అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి.   మారుతున్న వాతావరణ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మేయవద్దు.

ధనుస్సు రాశి

కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ కోరిక  నెరవేరుతుంది. నూతన ఉపాధి ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. అప్పులు చేస్తారు. 

మకర రాశి

ఆగిపోయిన పనిని సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మీ నిర్ణయ సామర్థ్యం ప్రశంసలు అందుకుంటుంది. ఉద్యోగం చేసేవారి ఆదాయం పెరుగుతుంది. 

కుంభ రాశి

ఈ రోజు మీకు సాధారణ ఫలితాలుంటాయి.అవసరం అయివారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మానసికంగా బలంగా ఉంటారు. విద్యార్థులు అధ్యయనాల విషయంలో కొంత ఆందోళన చెందుతారు. మీన రాశి

ఈ రోజు మీకు అంత మంచి ఫలితాలుండవు. కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీపై ఆధారపడినవారి సంఖ్య పెరుగుతుంది. స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. పనిలో వేగం ఆశించిన స్థాయిలో ఉండదు.  

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.