2025 జూన్ 8 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 8th 2025

మేష రాశి (Aries) జూన్ 8, 2025

మేష రాశి వారికి ఈ రోజు గ్రహ స్థితి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలలో మీరు విజయం సాధిస్తారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు.  అదృష్టం కలిసొస్తుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి తీరిపోతుంది. కుటుంబ జీవితం నుంచి ఆనందం పొందుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. 

వృషభ రాశి (Taurus) జూన్ 8, 2025

వృషభ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే రోజు.  కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు, అయితే, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. ఈ రోజు మీ పెట్టుబడి వల్ల  భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరగుతుంది. మానసికంగా కొంత కలత చెందుతారు. ఆరోగ్యం బావుంటుంది

మిథున రాశి (Gemini) జూన్ 8, 2025

మిథున రాశి వారికి ఈ రోజు బడ్జెట్ పరంగా చాలా మంచి రోజు అవుతుంది.  మీ ఖర్చులు తగ్గుతాయి  మీ ఆదాయం బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చేతికందుతాయి. ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది. వైవాహికజీవితంలో వాగ్వాదం ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దు..పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించండి

కర్కాటక రాశి (Cancer) జూన్ 8, 2025

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ పనిలో చాలా బలంగా ఉండబోతున్నారు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేపట్టిన పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ జీవితంలో ఈ రోజు ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండవు.  

సింహ రాశి (Leo) జూన్ 8, 2025

సింహ రాశి వారికి గ్రహాల కదలికల ప్రకారం ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రోజు. ఈ రోజు మీరు తక్కువ శ్రమతో మంచి లాభాలు పొందుతారు.  పెట్టుబడి పెట్టిన పథకాలు ఈ రోజు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి లేదా మీరు సుదీర్ఘ యాత్రకు వెళ్ళే ఆలోచనను సాకారం చేసుకోవచ్చు.  అదృష్టం కలిసొస్తుంది.  ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు మంచిది.

కన్య రాశి (Virgo) జూన్ 8, 2025

కన్యా రాశి వారు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.  వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి,  ఆలోచించి మాట్లాడండి. రహస్య మార్గాల ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి తులా రాశి (Libra) జూన్ 8, 2025

తులా రాశి వారికి చాలా మంచి రోజు.  కొత్త వ్యక్తిని కలుసుకోవచ్చు. భాగస్వామ్య  వ్యాపారం చేసేవారు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. సామాజికంగా మీరు మంచి గౌరవాన్ని పొందవచ్చు మరియు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఈ రోజు పదోన్నతికి సంబంధించిన మంచి వార్త వింటారు.  గృహ జీవితంలో సామరస్యం ఉంటుంది.  

వృశ్చిక రాశి (Scorpio) జూన్ 8, 2025

వృశ్చిక రాశి వారు ఈ రోజు భారీ పెట్టుబడులు పెట్టొద్దు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండటం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. మీకు గాయాలు అయ్యే అవకాశం ఉంది వాహనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి.  ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాన్ని పొందుతారు. ఈ రోజు మీరు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలలో విజయం లభిస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 8, 2025

ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో అన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటారు. ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ రోజు మీ పనిలో ఏదైనా తప్పు జరగవచ్చు. ఈ రోజు మీరు ధనాన్ని పొందుతారు, దీనితో మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది . ఆరోగ్యం బావుంటుంది మకర రాశి (Capricorn) జూన్ 8, 2025

మకర రాశివారు ఈ రోజు ఆనందంగా ఉంటారు.  ఈ రోజు మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది.  కారు కొనడానికి లేదా ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నత ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు, మీ జీవిత భాగస్వామి ఏదో ఒక విషయం గురించి మీతో కోపంగా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభ రాశి (Aquarius) జూన్ 8, 2025

కుంభ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు లాభం పొందడానికి మీ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పనిచేసే ప్రదేశంలో గౌరవాన్ని పొందుతారు. ఎక్కడో ధనం పొందిన శుభవార్త కూడా అందుతుంది. అయితే, ఈ రోజు మీకు కొంచెం ఖర్చులు ఉండవచ్చు.  ఆరోగ్యం బాగుంటుంది. మీన రాశి (Pisces) జూన్ 8, 2025

మీన రాశి వారికి ఈ రోజు గ్రహ స్థితి  అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో ఏదో ఒక విషయం గురించి లోతైన చర్చ  జరుగుతుంది. రహస్యంగా ధనం పొందే అవకాశం వస్తుంది లేదంటే ఇక రాదు అనుకున్న డబ్బు చేతికందుతుంది. ఉద్యోగులకు పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.