2025 జూన్ 7 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 7th 2025
మేష రాశి (Aries) జూన్ 7, 2025
మీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపే వ్యక్తిని మీరు కలుస్తారు. ఆఫీసులో మీ మంచి పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. మీరు గర్వపడేలా రోజు గడుస్తుంది. అన్నదానం చేయడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. పని చేయడానికి కొత్త మార్గాలపై మీ స్నేహితులతో చర్చిస్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి.
వృషభ రాశి (Taurus) జూన్ 7, 2025
వ్యాపారంలో మంచి లాభం రావడంతో మరింత విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. సంగీత రంగంలో ఉండేవారికి ఈ రోజు శుభదినం. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది.
మిథున రాశి (Gemini) జూన్ 7, 2025
చాలా రోజులుగా చేయాలి అనుకుంటున్న పనిని ఈ రోజు మీరు ప్రారంభించవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం త్వరలోనే పొందుతారు. మీ ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు మీతో స్నేహం చేయడానికి ముందుకు రావచ్చు. విద్యార్థులు చదువులో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
కర్కాటక రాశి (Cancer) జూన్ 7, 2025
ఈ రోజు మీకు మిశ్రమ ప్రతిస్పందనలు లభిస్తాయి. ప్రారంభంలో మీ పనులు పూర్తవుతున్నాయని మీరు భావిస్తారు కానీ పెండింగ్ పడతాయి . ఏదైనా ముఖ్యమైన పనిని చేసే ముందు, పెద్దల లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ రోజు అడ్డంకులు అధిగమిస్తారు. మీ మనస్సు కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో ముందుకు సాగడానికి మీకు సహాయం అందుతుంది. సింహ రాశి (Leo) జూన్ 7, 2025
విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు దీని గురించి ఎవరినైనా సంప్రదించవచ్చు. ఈ రోజు డబ్బు లావాదేవీలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు మరోసారి ఆలోచించండి. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. సంతోషి మాతను పూజించండి, ఆరోగ్యం బాగుంటుంది.
కన్య రాశి (Virgo) జూన్ 7, 2025
ఈ రోజు మీరు చేపట్టిన పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు. కుటుంబంలో ఎవరికైనా పెళ్లి సంబంధం చూసినట్టైతే త్వరలో నిశ్చయం అవుతుంది. కోర్టు కేసులలో శుభవార్త వింటారు. వైవాహిక సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మీకు మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆలయంలో పండ్లుదానం చేస్తే మీ కోర్కెలు నెరవేరుతాయి.
తులా రాశి (Libra) జూన్ 7, 2025
ఈ రోజు మీరు గొప్ప వ్యక్తిని కలుసుకుంటారు...రానున్న రోజుల్లో మీకు వారివల్ల మంచి జరుగుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను పొందవచ్చు. మీ మాటలు అదుపులో ఉంచుకోండి. మీ నోటి నుంచి వచ్చిన ఓ తప్పుడు మాట మీ సంబంధాలను పాడుచేస్తుంది. భాగస్వామితో ఏదో విషయంలో వాగ్వాదం ఉండవచ్చు. సాయంత్రం ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. ఆవుకు రొట్టె తినిపించండి, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 7, 2025
మీరు కోరుకున్న ఫలితాలు ఈ రోజు పొందుతారు. వ్యాపారాన్ని వేరే చోటికి మార్చాలనుకుంటే మరోసారి స్థలాన్ని పరిశీలించండి. భాగస్వామ్య వ్యాపారంలో మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగులకు శుభఫలితాలుంటాయి. కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు.
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 7, 2025
ఈ రాశివారు కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. మీ దినచర్యలో మార్పులు చేసుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ రోజు పురోగతి ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి శుభఫలితాలొస్తాయి. ఇనుము వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి మంగళకరంగా ఉంటుంది.
మకర రాశి (Capricorn) జూన్ 7, 2025
ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నష్టపోతారు. హోల్‌సేల్ వ్యాపారులు ఈ రోజు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. ఆస్తికి సంబంధించిన విషయాలలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అనాథాశ్రమంలో పిల్లలకు ఆహారం ఏదైనా బహుకరించండి మీ జీవితంలో మరింత సంతోషం నిండుతుంది. కుంభ రాశి (Aquarius) జూన్ 7, 2025
ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు ఉత్తమమైనది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఆవునేతితో దీపం వెలిగించండి..సంబంధంలో మాధుర్యం ఉంటుంది.
మీన రాశి (Pisces) జూన్ 7, 2025
కళలు, సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తి పొందుతారు. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చిన్న పరిశ్రమల్లోపెట్టుబడి పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. ఏదైనా ఉత్పత్తిని మార్కెటింగ్ చేసేందుకు ఈ రోజు మంచిది. పదోన్నతికి అవకాశాలున్నాయి. మీ ఇష్టదైవం ముందు చేతులు జోడించి నమస్కరించండి. ధనలాభం ఉంటుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.