2025 జూలై 26th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 26th 2025
 
మేష రాశి (Aries)

Continues below advertisement


కెరీర్: తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు పనిలో మంచి ఫలితాలు వస్తాయి. మీ ప్రవర్తన , పనితీరు  ప్రభావం ఇతరులపై పడుతుంది.
 వ్యాపారం: మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా తప్పనిసరిగా తీసుకోండి.
 ధనం: డబ్బుకు సంబంధించిన ఏదైనా పాత లావాదేవీ ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 విద్య: విద్యార్థులకు చదువులో విజయం సాధించే అవకాశం ఉంది. సోమరితనం మానుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
 ప్రేమ/కుటుంబం: ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి
 పరిహారం: గణేశుడికి శనగపిండి లడ్డూ సమర్పించండి, అన్ని పనులలో మంచి ఫలితాలు వస్తాయి.
 లక్కీ కలర్: పసుపు
 లక్కీ నంబర్: 1


వృషభ రాశి (Taurus)


 కెరీర్: ఉద్యోగంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది, ఓపిక పట్టండి
 వ్యాపారం: వ్యాపార కార్యకలాపాలు కొంచెం నెమ్మదిగా ఉంటాయి, కానీ పరిస్థితులను బట్టి ఓర్పుతో ఉండటం మంచిది
 ధనం: ఇంటి సౌకర్యాలకు సంబంధించిన ఏదైనా వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులను ఆలోచించి చేయండి
 విద్య: పిల్లల సమస్యలలో మీ సహకారం వారికి సరైనది. చదువుపై దృష్టి పెట్టండి
 ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి సహకారం అందుతుంది. కుటుంబంతో గడిపిన సమయం మానసిక శాంతిని కలిగిస్తుంది
 పరిహారం: శివలింగంపై పచ్చి పాలు సమర్పించండి, సానుకూల శక్తి లభిస్తుంది
 లక్కీ కలర్: తెలుపు
 లక్కీ నంబర్: 6


 మిథున రాశి (Gemini)


 కెరీర్: కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమస్య పరిష్కారమవడంతో మనస్సు తేలికగా ఉంటుంది.
 వ్యాపారం: ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఖర్చులను పరిమితం చేయండి , అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దు.
 ధనం: మీరు స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయవలసి రావచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి.
 విద్య: చదువుపై మనసు లగ్నమవుతుంది. విద్యార్థులకు పాత సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.
 ప్రేమ/కుటుంబం: సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. పొరుగువారితో మంచి సంబంధాలు కొనసాగుతాయి.
 పరిహారం: పేదవారికి అన్నదానం చేయండి
 లక్కీ కలర్: ఆకుపచ్చ
 లక్కీ నంబర్: 5


 కర్కాటక రాశి (Cancer)


కెరీర్: దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయి.  
 వ్యాపారం:  ఏదైనా కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉండవచ్చు. కొత్త పథకాలపై పని ప్రారంభమవుతుంది.
 ధనం: ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
 విద్య: ఏదైనా కష్టమైన సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి.
 ప్రేమ/కుటుంబం: సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించడానికి, ప్రవర్తనలో మృదువుగా ఉండండి.
 పరిహారం: ఏదైనా ఆలయంలో నైవేద్యం సమర్పించి అందరకీ పంచిపెట్టండి
 లక్కీ కలర్: తెలుపు
 లక్కీ నంబర్: 2


 సింహ రాశి (Leo)


 కెరీర్: సీనియర్ల సహకారం అందుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు.
 వ్యాపారం: కొత్త కాంట్రాక్ట్ పొందుతారు. రాజకీయ సంబంధాలు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.
 ధనం: ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు.
 విద్య: విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది సరైన సమయం.
 ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల విజయం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
 పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.
 లక్కీ కలర్: గోల్డెన్
 లక్కీ నంబర్: 3


 కన్యా రాశి (Virgo)


 కెరీర్: కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో సమన్వయం ఉంచుకోండి.
 వ్యాపారం: వ్యాపార విజయం వల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారు.
 ధనం: వృధా ఖర్చులను నివారించండి. మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి.
 విద్య:  కుటుంబ సభ్యుల లేదా ఉపాధ్యాయుల సహకారంతీసుకోండి
 ప్రేమ/కుటుంబం: అనుమానాలను నివారించండి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
 పరిహారం: ఆవుకు గ్రాసం తినిపించండి
 లక్కీ కలర్: నీలం
 లక్కీ నంబర్: 4


 తులా రాశి (Libra)


 కెరీర్: ఈ రోజు పనిచేసే ప్రదేశంలో విజయం సాధిస్తారు.
 వ్యాపారం:  ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
 ధనం: సౌకర్యవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు అవుతుంది.
 విద్య: పిల్లలకు మీ సలహా వల్ల ప్రయోజనం ఉంటుంది.
 ప్రేమ/కుటుంబం: సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. కుటుంబంతో గడిపిన సమయం మనస్సును సంతోషపరుస్తుంది.
 పరిహారం: అమ్మవారి ఆరాధన చేయండి
 లక్కీ కలర్: గులాబీ
 లక్కీ నంబర్: 7


 వృశ్చిక రాశి (Scorpio)


 కెరీర్: పనులు సకాలంలో పూర్తవుతాయి.మీ గౌరవం పెరుగుతుంది
 వ్యాపారం: ఈరోజు వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది.
 ధనం: కుటుంబం కోసం డబ్బు ఖర్చు అవుతుంది.
 విద్య: ఉపాధ్యాయులకు రోజు బిజీగా ఉంటుంది.
 ప్రేమ/కుటుంబం: పరస్పర సంబంధాలు బలపడతాయి. అతిథుల రాకపోకలు ఉండవచ్చు.
 పరిహారం: వృద్ధులకు సేవ చేయండి.
 లక్కీ కలర్: ఎరుపు
 లక్కీ నంబర్: 9


 ధనుస్సు రాశి (Sagittarius)


 కెరీర్: అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటుంది.
 వ్యాపారం: ఏదైనా కొత్త పథకం ప్రారంభం కావచ్చు.
 ధనం: రావాల్సిన డబ్బు చేతికందుతుంది
 విద్య: విద్యార్థులకు కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది.
 ప్రేమ/కుటుంబం: కుటుంబ సంబంధాలు మధురంగా ఉంటాయి.
 పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
 లక్కీ కలర్: పసుపు
 లక్కీ నంబర్: 8


 మకర రాశి (Capricorn)


 కెరీర్: పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సానుకూల ఆలోచనతో పనులు విజయవంతమవుతాయి.
 వ్యాపారం: ఆస్తి వ్యవహారాల్లో లాభం పొందుతారు
 ధనం: డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
 విద్య: విద్యార్థులు మనసు పెట్టి చదువుకుంటారు.
 ప్రేమ/కుటుంబం: కుటుంబ సహకారం అందుతుంది. మహిళలు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు.
 పరిహారం: నల్లటి వస్తువులను దానం చేయండి.
 లక్కీ కలర్: బ్రౌన్
 లక్కీ నంబర్: 10


 కుంభ రాశి (Aquarius)


 కెరీర్: అదనపు బాధ్యతలు పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది.
 వ్యాపారం: ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి లాభం పొందుతారు
 ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
 విద్య: విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు.
 ప్రేమ/కుటుంబం: పాత స్నేహితుడితో మాట్లాడతారు. ప్రేమ జీవితం బాగుంటుంది.
 పరిహారం:మీ ఇష్టదైవాన్ని పూజించండి
 లక్కీ కలర్: ఊదా
 లక్కీ నంబర్: 11


 మీన రాశి (Pisces)


కెరీర్: పనిచేసే ప్రదేశంలో సమన్వయం బాగుంటుంది
వ్యాపారం: వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిపుణుల సలహా తీసుకోండి.
ధనం: డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
విద్య: విద్యార్థులకు ఈ రోజు బాగుంటుంది.
ప్రేమ/కుటుంబం: ప్రేమికులకు రోజు అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి భావోద్వేగ మద్దతు లభిస్తుంది.
పరిహారం: చేపలకు, పక్షులకు ఆహారం వేయండి
లక్కీ కలర్: సిల్వర్
లక్కీ నంబర్: 12


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.