Rasi Phalalu Today: జూన్ 25, 2025 మేషం నుంచి మీనం వరకు ఈరోజు మీ రాశిఫలితం తెలుసుకోండి!
Horoscope for June 25th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.
2025 జూన్ 25 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 25th 2025
మేష రాశి (Aries) జూన్ 25, 2025
Just In
ఈ రోజు బాగుంటుంది. ముఖ్యమైన పని కోసం మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదురుతుంది. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.
వృషభ రాశి (Taurus) జూన్ 25, 2025
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి.
మిథున రాశి (Gemini) జూన్ 25, 2025
ఈ రోజు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి (Cancer) జూన్ 25, 2025
ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. ఏదైనా ప్రత్యేక పని కోసం బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. కోర్టు కేసులో చిక్కుకున్నవారు ఈ రోజు దాన్నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.
సింహ రాశి (Leo) జూన్ 25, 2025
ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం ఇబ్బంది పడతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు చికాకు పెంచుతాయి. వాహనం జాగ్రత్తగా నడపండి.
కన్యా రాశి (Virgo) జూన్ 25, 2025
ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆహారంపై నియంత్రణ ఉంచుకోండి. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు మంచిది కాదు..నష్టపోయే అవకాశం ఉంది. సన్నిహితుడి కారణంగా మీరు పెద్ద ఆఫర్‌ను కోల్పోవచ్చు.
తులా రాశి (Libra) జూన్ 25, 2025
ఈ రోజు పాత స్నేహితుడిని కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని పూర్తవుతుంది. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 25, 2025
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలా రోజులుగా చేయాలి అనుకున్న పనిని ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఓ ప్రత్యేకవ్యక్తి సహకారం మీకు లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు.
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 25, 2025
ఈ రోజు కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనపరుస్తుంది. ఉద్యోగం , వ్యాపారంలో అనుకూల ఫలితాలు లేవు..అప్రమత్తంగా వ్యవహరించండి. భాగస్వామ్య వ్యాపారంలో నష్టపోతారు. వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. పూర్వీకుల ఆస్తిలో వాటా లభిస్తుంది.
మకర రాశి (Capricorn) జూన్ 25, 2025
ఈ రోజంతా బిజిగా ఉంటారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు, నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే మంచి సమయం. చేపట్టిన పని పూర్తిచేసేందుకు చాలా అడ్డంకులు అధిగమించాల్సి వస్తుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది
కుంభ రాశి (Aquarius) జూన్ 25, 2025
ఈ రోజంతా మీకు సమస్యలతో నిండి ఉంటుంది. కోర్టు కేసుల్లో , అనుకోని వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద నష్టాన్ని చూస్తారు. వ్యతిరేక శక్తులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు...అప్రమత్తంగా ఉండండి. భారీ పెట్టుబడులు పెట్టొద్దు.
మీన రాశి (Pisces) జూన్ 25, 2025
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. అతి పెద్ద సమస్య నుంచి విముక్తి పొందుతారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో లాభపడతారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.