2025 జూన్ 22 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 22st 2025

మేష రాశి (Aries) జూన్ 22, 2025

ఈ రోజు మీకు  ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రణాళికలు వేగంగా అమలుచేస్తారు. ఈ రోజు మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. పెద్దల సహకారం మీకుంటుంది. విద్యార్థులకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఏదైనా శుభ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. మతపరమైన పనుల పట్ల విశ్వాసంతో ముందుకు సాగుతారు. స్ఫూర్తిదాయకమైన పుస్తకం చదివేందుకు ఆసక్తి చూపిస్తారు. వృషభ రాశి (Taurus) జూన్ 22, 2025

ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. ఉదయం ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. పాత స్నేహితుడు ఆర్థిక సహాయం అడుగుతారు..మీ  సామర్థ్యం మేరకు సహాయం చేస్తారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఇంటికి సంబంధించిన సమస్యలపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జీవిత పోరాటంలో మీరు అదృష్టవంతులుగా భావిస్తారు.

మిథున రాశి (Gemini) జూన్ 22, 2025

ఈ రోజు మీకు బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో మంచి అడుగు వేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. విద్యార్థులు ఏదైనా గందరగోళం నుంచి ఉపశమనం పొందుతారు. పోటీ రంగంలో మీరు ముందుకు సాగుతారు.  వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ రోజు మీరు జీవిత భాగస్వామి మద్దతును పొందుతారు.

కర్కాటక రాశి (Cancer) జూన్ 22, 2025

ఈ రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి  కొత్త ప్రణాళికలు వేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. రచనారంగంలో ఉండేవారు కొత్త ఆలోచనతో ఉంటారు సింహ రాశి (Leo) జూన్ 22, 2025

ఈ రోజు అనవసరంగా ఎవరితోనూ వాగ్వాదానికి దిగకుండా ఉండండి. మీ పాత స్నేహితులను కలుస్తారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం మిమ్మల్ని బాధపెడుతుంది. ఇంతకు ముందు ఏదైనా పెట్టుబడి పెడితే, మీరు దాని పూర్తి ప్రయోజనాన్ని  పొందుతారు.

కన్యా రాశి (Virgo) జూన్ 22, 2025

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మీ పనితీరును కుటుంబ సభ్యులు ప్రశంసిస్తారు. ఈ రోజు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు.  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. మీరు ఎవరికైతే సహాయం చేశారో, వారు ఈ రోజు మీకు సహాయం చేస్తారు. ఉపాధ్యాయులకు ఈ రోజు చాలా బాగుంటుంది.  

తులా రాశి (Libra) జూన్ 22, 2025

ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. మీ వినయపూర్వకమైన స్వభావాన్ని అందరూ మెచ్చుకుంటారు. డబ్బు అదనంగా ఎక్కడ ఖర్చవుతోందో గమనించాలి. ఈ రోజు మీరు బంధువుల నుంచి శుభవార్త వింటారు. జీవితంలో చాలా విషయాలను మార్చడం అసాధ్యమని అంగీకరించడమే అతిపెద్ద పాఠం. కొన్నాళ్ల నుంచి ఉన్న చికాకుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు.  

వృశ్చిక రాశి (Scorpio) జూన్ 22, 2025

ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవిత భాగస్వామితో ఏదైనా పని గురించి చర్చిస్తారు.  స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబంలో  సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ రోజు కార్యాలయంలో మీకు కొత్త ప్రాజెక్ట్ లభిస్తుంది, దానిని పూర్తి చేయడానికి సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. 

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 22, 2025

ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. ఈ రోజు ఎలాంటి చట్టపరమైన విషయాల్లోనూ తొందరపడవద్దు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి  బయటపడతారు. ఈ రోజు మీరు మీ పనిని సాధారణ వేగంతో పూర్తి చేస్తారు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, రోజు శుభంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి కెరీర్‌లో విజయం సాధించవచ్చు. దానధర్మాలలో చురుకుగా పాల్గొంటారు.  

మకర రాశి (Capricorn) జూన్ 22, 2025

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా బాగుంటుంది.  పెరుగుతున్న ఖర్చులు ఆందోళనకు కారణం కావచ్చు. ఆస్తి ఒప్పందాన్ని తొందరపడి చేయవద్దు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రముఖ నాయకులను కలిసే అవకాశం పొందుతారు. పని రంగంలో మీ పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఏదైనా పాత సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్య పరంగా ఈ రోజు మీరు బాగానే ఉంటారు 

కుంభ రాశి (Aquarius) జూన్ 22, 2025

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. మార్కెటింగ్‌లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ వహిస్తే, మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును ఆదా చేయగలుగుతారు. ఏదైనా విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. 

మీన రాశి (Pisces) జూన్ 22, 2025

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో మీ ఆనందానికి అవధులుండవు.  భిన్నమైన పనిని చేయాలని ఆలోచిస్తారు. మీ ఆలోచనా విధానానికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారం చేస్తున్న వారు బిజీగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది.  

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.