2025 జూన్ 19 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 19th 2025

మేష రాశి (Aries) జూన్ 19, 2025

ఈ రోజు సుఖంగా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ఆగిపోయిన పాత పని పూర్తవ్వడం వల్ల మనస్సు సంతోషిస్తుంది. పరిపాలనా రంగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది.  కుటుంబంలో పరస్పర సామరస్యం కనిపిస్తుంది. భార్య, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేయవచ్చు. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఈ రోజు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మీకు మంచిది.

వృషభ రాశి (Taurus) జూన్ 19, 2025

ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.  కొన్ని ప్రత్యేక పనుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. పని చేసే చోట మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. పని చేసే చోట పెట్టుబడి పెట్టడం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండి.  మిథున రాశి (Gemini) జూన్ 19, 2025

ఈ రోజు మీరు అనవసరమైన పనుల్లో చిక్కుకుంటారు, దీనివల్ల మీ సమయం, డబ్బు వృధా అవుతుంది. కోపం తగ్గించుకోవడం మంచిది.  కొన్ని విషయాలను విస్మరించడం ఈ రోజు మీకు మంచిది. వ్యాపారంలో భాగస్వామ్యం గురించి ఆలోచించిన తర్వాతే ఏదైనా పని చేయండి. ఈ రోజు పని చేసే చోట మార్పులు చేయవద్దు. కుటుంబంలో ప్రతికూల శక్తులు మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించవచ్చు.

కర్కాటక రాశి (Cancer) జూన్ 19, 2025

ఈ రోజు మీకు అంత మంచిరోజు కాకపోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. పరిపాలనా రంగంలో అధికారులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు పని చేసే చోట మీ శత్రువుల వల్ల చాలా ఇబ్బంది పడతారు. కుటుంబ పరంగా ఈ రోజు పరిస్థితి బాగానే ఉంటుంది. భార్య ఆరోగ్యం గురించి మనసులో ఆందోళన ఉంటుంది. ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

సింహ రాశి (Leo) జూన్ 19, 2025

ఈ రోజు సంతోషంతో నిండి ఉంటుంది. ఇంట్లో కొత్త అతిథి రావచ్చు.  కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.   తల్లిదండ్రులు, సోదరులు ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లొచ్చు. వ్యాపార రంగంలో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  భాగస్వామ్య వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది.

కన్యా రాశి (Virgo) జూన్ 19, 2025

ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం మీకు చాలా మంచిది. పని చేసే చోట కొత్త సహచరులు కలుస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సోదరుడు, మేనల్లుడి నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ రోజు పాత అప్పు నుంచి విముక్తి పొందడం మీకు చాలా సంతోషాన్నిస్తుంది. భార్య, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది.

తులా రాశి (Libra) జూన్ 19, 2025

ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది, దీని కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈ రోజు పని కారణంగా మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వాతావరణం కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబంలో సమయం అనుకూలంగా ఉంటుంది.  ఆస్తి సంబంధిత పనుల్లో ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio) జూన్ 19, 2025

ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు తమ అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మీకు మంచిది. ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ మనసులోని మాటలను ఎవరితోనూ పంచుకోవద్దు. కుటుంబ అంతర్గత విషయాలను పరిష్కరించడంలో ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసుల వివాదాలకు దూరంగా ఉండండి.

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 19, 2025

ఈ రోజు మీకు మంచి రోజు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే విజయం సాధిస్తారు. ఈ రోజు ఓ ప్రసిద్ధ వ్యక్తిని కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆగిపోయిన ధనం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీరు కుటుంబ శ్రేయస్సు కోసం ఏదైనా ప్రత్యేకమైన పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

మకర రాశి (Capricorn) జూన్ 19, 2025

ఈ రోజు  మీ సమయం మొత్తం అనవసరమైన పనుల్లో గడిచిపోతుంది.  ఏదైనా వివాదంలో చిక్కుకుంటారు.  శత్రువుల కుట్రలకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించినట్లు అనిపిస్తుంది. వ్యాపారంలో నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగం చేసేవారికి భాగస్వామితో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పూర్వీకుల ఆస్తి విషయంలో గొడవలు జరగవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

కుంభ రాశి (Aquarius) జూన్ 19, 2025

కుంభ రాశివారికి ఈ రోజు సమస్యలతో నిండి ఉంటుంది.   కోర్టు కేసుల వివాదంలో చిక్కుకోవచ్చు. మీ వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రతికూల శక్తులు మీపై కుట్రలు పన్నవచ్చు. ఈ రోజు వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టొద్దు.  ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో  విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. వాదనలకు దూరంగా ఉండండి

మీన రాశి (Pisces) జూన్ 19, 2025

ఈ రోజు మీరు మీ స్నేహితులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి లేదంటే నష్టోతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  వ్యాపారంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ఆలోచన ఉండవచ్చు. ఉద్యోగంలో అధికారుల పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.