2025 జూన్ 16 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 16th 2025
మేష రాశి
ఈ రోజంతా మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ చుట్టూ ఉండేవారు మీ అంచనాలకు అనుగుణంగా ఉండరు. రక్తపోటు రోగులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆగిపోయిన పని గురించి ఆందోళన చెందుతారు..త్వరలో పని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. వృషభ రాశి
ఈ రోజు అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. పిల్లల గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. మీ ముందు శత్రువులు బలహీనపడతారు. ఏ సాధారణ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించవద్దు.
మిథున రాశి
ఈ రోజు మీరు కుటుంబంతో సమయం స్పెండ్ చేస్తారు. కొన్ని కారణాల వల్ల మీ మనస్సు బాధపడవచ్చు. పెద్ద తోబుట్టువుల గురించి ఆందోళన ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలపై వివాదం పెరిగే అవకాశం ఉంది. మీరు ఎత్తు ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు మీ పని గురించి చాలా చురుకుగా ఉంటారు. ఫీల్డ్‌లో మీ ప్రభావం పెరుగుతుంది. పెద్దవారి సలహా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పనిముట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
ఈ రోజు మీరు అనుమానాస్పదంగా వ్యవహిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉన్నత అధికారులు మీపై అనియంత్రిత ఆరోపణలు చేయవచ్చు. మత్తు , ధూమపానానికి దూరంగా ఉండండి. ఒంటరిగా ప్రయాణం చేయొద్దు. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.
కన్యా రాశి
మీరువ్యాపారంలో చాలా శ్రద్ధ వహించాలి. పనిచేసే ప్రదేశంలో మీ ప్రభావం పెరుగుతుంది కానీ అంతా మీ తప్పులనే చూస్తారు. పరిశోధన పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఊహించిన విజయాన్ని పొందవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తులా రాశి
ఈ రోజంతా మీరు నిరాశగా ఉంటారు. సన్నిహితుల సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఎంతటివారినైనా మీ మాటలతో ప్రభావితం చేయగలరు. మీపై అంతా మంచి అభిప్రాయం కలిగిఉంటారు. విదేశాల నుంచి ఉద్యోగ ప్రతిపాదనలు పొందవచ్చు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తారు. వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటికోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు స్నేహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ వినియోగదారుల సౌలభ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
మకర రాశి
ఈ రోజు మీరు శుభవార్త వింటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగంలో ఉన్నత అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. వ్యాపారం కోసం నూతన ప్రణాళికలు వేయొచ్చు. సహోద్యోగులపై ఎక్కువగా ఆధారపడవద్దు.
కుంభ రాశి
ఈ రోజంతా చికాకుగా ఉంటారు. ముఖ్యమైన పనులను ప్రారంభించకూడదు. ప్రయాణంలో అనవసరమైన చర్చల నుంచి దూరాన్ని పాటించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులు పనులపై శ్రద్ధ వహించండి మీన రాశి
ఈ రోజు మీరు మానసికంగా బలంగా ఉంటారు. భవిష్యత్ పనుల కోసం ప్లాన్ చేసుకుంటారు. మీనుంచి డబ్బును ఆశించేవారున్నారు. వైవాహిక జీవితంలో సామరస్యాన్ని ఉంచండి. ఇంట్లో ప్రతికూల వ్యక్తలు గురించి చర్చించవద్దు. తగినంత నిద్ర అవసరం.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.