2025 జూన్ 14 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 14th 2025
మేష రాశి , 14 జూన్ 2025
మీ ప్రత్యర్థులు ఈ రోజు మీకు అనుకూలంగా మారుతారు. కొత్త ఇల్లు మారేందుకు ఆలోచన చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగుల పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.
వృషభ రాశి, 14 జూన్ 2025
ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు అధిగమిస్తారు. ఉద్యోగం మారేందుకు ఆలోచిస్తారు. ప్రేమ సంబంధాలలో ప్రతికూలత ఉంటుంది. సమయం ప్రకారం ప్రవర్తనలో మార్పులు చేయండి.
మిథున రాశి, 14 జూన్ 2025
ఈ రోజు అప్పులు తీసుకోవద్దు. ఇతరుల చర్యల్లో జోక్యోం చేసుకోవద్దు. వివాహ సంబంధాలకు సమయం ఇవ్వాలి. రక్తపోటు, కిడ్నీ రోగులకు సమస్యలు ఉండవచ్చు. ఒత్తిడి కారణంగా నిద్ర ప్రభావితమవుతుంది. వివాహంలో సమస్య ఉంటుంది.
కర్కాటక రాశి , 14 జూన్ 2025
ఈ రోజు మీరు ప్రేమ ప్రతిపాదనను పొందవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందుతారు. కుటుంబ పెద్దల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. స్నేహితులను కలుస్తారు. వైవాహిక చర్చలు విజయవంతం అవుతాయి.
సింహ రాశి , 14 జూన్ 2025
ఈ రోజు మీరు ఎక్కువ పని చేసిన తర్వాతే మంచి ఫలితాలు పొందుతారు. మీ భవిష్యత్ ప్రణాళికల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ సామర్థ్యాన్ని మీరు విశ్వసించండి. మీరు పనిచేసే ప్రదేశంలో రాజకీయాలు జరుగుతాయి. మీ మాటతీరుపై సంయమనం పాటించండి.
కన్యా రాశి, 4 జూన్ 2025
ఈ రోజు మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. నూతన ఉద్యోగం కోసం ఇంటర్యూలకు హాజరవుతారు. ఈ రాశి ఉద్యోగుల పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉంటారు. మీ ఆసక్తికి అనుగుణంగా పనిచేయడం విజయం సాధిస్తుంది. ప్రేమ సంబంధాలలో భాగస్వామి భావాలు గుర్తుంచుకోండి.
తులా రాశి, 14 జూన్ 2025
ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండాలి. పరధ్యానంలో ఉండొద్దు. ఎలక్ట్రికల్ వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించండి. మీ తప్పు అలవాట్లను త్వరగా నియంత్రించండి. మీరు కొత్త వాహనాలను కొనుగోలు చేయవచ్చు.
వృశ్చిక రాశి, 14 జూన్ 2025
ఈ రోజు మీ పనితీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులు అధ్యయనాలపై చాలా శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. పిల్లలు భవిష్యత్తును ప్లాన్ చేయవచ్చు.
ధనుస్సు రాశి , 14 జూన్ 2025
ఈ రోజు మీరు ప్రయోజనం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కమిషన్ సంబంధిత పనుల్లో నష్టపోతారు. కొత్త వ్యాపారంలో డబ్బుతో సమస్యలు ఉంటాయి. ప్రముఖులతో పరియచాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండాలి.
మకర రాశి, 14 జూన్ 2025
ఈ రోజు డబ్బు ఆదా చేయాలి అనుకుంటారు. చేపట్టిన పనికి తగిన మంచి ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి.
కుంభ రాశి, 14 జూన్ 2025
ఈ రోజు జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మంచిగా ఉంచాలి. ఉన్నత అధ్యయనాలపై ఆసక్తి చూపిస్తారు. చెడు వ్యక్తుల సహవాసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. ప్రభుత్వ వ్యవహారాలు మీకు సమస్యగా మారుతుంది.
మీన రాశి, 14 జూన్ 2025
ఈ రోజు చట్టపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న కేసుల ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు శుభఫలితాలు పొందుతారు. నిర్మాణ పనుల్లో వృద్ధి ఉంటుంది. మీరున్న రంగంలో సృజనాత్మక ప్రయోగాలు చేయవచ్చు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.